'ఆ స్టార్ హీరో నన్ను ర్యాగింగ్ చేసాడు'..అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాలో ఎంతో పవర్ఫుల్ గా కనిపిస్తాడు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారని ఆయన అభిమానులు, సన్నిహితులు చెబుతుంటారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లక్రితం కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ అలాగే నటించిన టెంపర్ సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ రెండు సినిమా కథలు కూడా ఒకే విధంగా ఉన్నాయని అప్పట్లో ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపించాయి. 

కానీ బాక్సాఫీస్ దగ్గర అటు పటాస్, ఇటు టెంపర్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' పటాస్ సినిమా ఆడియో ఫంక్షన్ కి రవితేజ, ఎన్టీఆర్ వచ్చారని.. అయితే పటాస్ సినిమా విషయంలో సంతోషం ఏంటంటే కళ్యాణ్ రామ్ జర్నీ.. అలాగే పటాస్ సినిమా పూర్తయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా సెట్స్ కు వచ్చే వారిని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఆ సమయంలో రోజు సాయంత్రం తనకు ర్యాగింగ్ ఉండేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తనతో ఒక ఆట ఆడుకుంటాడని.. ఆ ఆడుకోవడం కూడా మామూలుగా కాదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

అయితే ర్యాగింగ్ అంటే బాధ పెట్టేలా కాదని ఎన్టీఆర్.. సెట్ లో చాలా అల్లరి చేసే వారిని పేర్కొన్నారు అనిల్. కథ చెప్పవా,కథ చెప్పవా అంటూ అన్నయ్య అని అంటున్నాడని.. కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్  అనేవారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్ కు ముందే పటాస్ సినిమాని ఎన్టీఆర్ చూసేసారని..రెండు కథలకు సెంట్రల్ పాయింట్ ఒకటేనని.. యాదృచ్చికంగా ఈ రెండు సినిమాల విషయంలో అలా జరిగింది అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. అయితే పూరి జగన్నాథ్, తాను వేర్వేరు స్టైల్స్ లో టెంపర్, పటాస్ సినిమా లో తెరకెక్కించామని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: