ఖిలాడి సినిమాతో మీనాక్షి చౌదరి అదృష్టం మారబోతుందా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముద్దుగుమ్మలలో ప్రతి ఒక్కరు మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు,  కానీ కొంతమందికి మొదటి సినిమా అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం మొదటి సినిమాలో చేసిన నటనకు, ప్రదర్శించిన అందచందాలకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు రావడంతో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి.  ఇలా మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించపోయినప్పటికీ రెండవ సినిమాతోనే క్రేజీ సినిమా ఆఫర్ కొట్టేసిన ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ శుషాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది,  కాకపోతే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు ప్రేక్షకులను నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో మీనాక్షి చౌదరి కి తన రెండో సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం దక్కింది.

మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన  ఖిలాడి ఈ సినిమా ఈ నెల 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు వేరే సినిమా నుండి కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమా గనుక పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నట్లయితే భారీగా కలెక్షన్ లను కూడా సాధించే అవకాశాలు  ఉన్నాయి,  ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే రోజు భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఒకవేళ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించినట్లయితే టాలీవుడ్ లో సాక్షి చౌదరి కు క్రేజీ సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: