మారుతీ కి డెడ్ లైన్ పెట్టిన ప్రభాస్!!

P.Nishanth Kumar
చిన్న సినిమాల దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఇప్పుడు ఓ మోస్తరు హీరోలతో సినిమాలు చేస్తూ అగ్ర దర్శకుడు గా మారుతున్నాడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన గత ప్రతి రోజు పండగే చిత్రం భారీ స్థాయిలో హిట్ అవడంతో ఈయనకు టాలీవుడ్ లో భారీగా డిమాండ్ పెరిగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం గోపీచంద్ కలిసి పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందట.

అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం తర్వాత ఆయన చేయబోయే తదుపరి సినిమా ప్రభాస్ తో ఉండబోతోందని వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆయన వివరణ ఇస్తూ కాలం అన్నిటికి సమాధానం చెబుతుంది అని తెలిపారు. కానీ ఈ సినిమా లేదని మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో మారుతి ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారట. ఈ లోపు ఈ సినిమాను పూర్తి చేస్తే ఈ చిత్రాన్ని ఒప్పుకుంటారని ప్రభాస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో భారతి 60 రోజుల్లో తాను అనుకున్న కథను ఏ విధంగా చేయాలి అనే విధంగా ప్రణాళికలు రచించుకొంటున్నారట. రాధే శ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంచిన ప్రభాస్ ఆ తర్వాత సలార్ మరియు ఆదిపురుష్ చిత్రాలను విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మారుతి సినిమా అనుకున్నట్లుగా 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంటుందా అనేది చూడాలి. మరి ఇన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యం లో ఈచిత్రం విడుదల తేదీ ఎప్పుడు కుదురుతుంది అనేది చూడాలి. ఈ చిత్రానికి డీలక్స్ రాజా అనే టైటిల్ ను అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: