ఆది సాయి కుమార్ డెడికేషన్ మెచ్చుకోవాలి!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోలు ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ప్రేక్షకులను అలరించాలని ఉద్దేశంతో హీరోగా నిలదొక్కుకోవాలానే లక్ష్యంతో వారు సినిమాలు చేస్తూనే ఉంటారు. అయితే వారు చిన్న బడ్జెట్ సినిమాల హీరోలు కావడం నిర్మాతలు పెద్దగా నష్టపోకపోవడంతో వారు ఈ విధంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా తెలుగు చిత్రపరిశ్రమకు ప్రేమ కావాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్. 

తమిళనాడు లతో డాన్సులతో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆది సాయి కుమార్ మొదట్లో మంచి సినిమాలే చేసినా కూడా ఆ తర్వాత కాలంలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయడంలో విఫలమయ్యాడు. అంతేకాదు ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు చేయడంలో కూడా ఆయన వెనుకబడి పోయాడు. అందుకే ఆయన సినిమాలు భారీ స్థాయిలో నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వరుసగా పది సినిమాల నుంచి ఒక్క విజయం కూడా లేదు అని చెప్పవచ్చు.

అయినా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కట్టడం విశేషం సినిమా చేయాలనే ఫ్యాషన్ తో జయాపజయాలు చూడకుండా కొంతమంది నిర్మాతలు ఆది సాయికుమార్ పై డబ్బు పెడుతున్నారు. అయితే అవి వారికి తిరిగి రాకపోవడం ఆది సాయి కుమార్ కి కూడా ఎంతో బాధను కలిగిస్తుంది. మరియు ఇతర హీరోలు ఏ విధమైన కథలు ఎంపిక చేసుకుంటున్నారు ఆ విధంగా ఆయన కూడా కథలు ఎంపిక చేసుకుని భారీ స్థాయిలో ఇమేజ్ దక్కించుకోవాలి అనేది కొంతమంది సాయికుమార్ అభిమానుల కోరిక. సాయి కుమార్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆది ఆయన పేరు నిలబెట్టే విధంగా మంచి సినిమాలు చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పైన 5 పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడూ భారీ స్థాయిలో భారీ బ్రేక్ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: