RCB అంటే కోహ్లీ అని ఎందుకంటారో.. ఈ రికార్డులు చూస్తే అర్థమవుతుంది?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని టీమ్స్ లాగా బెంగళూరు టీం టైటిల్ గెలవలేక పోయినప్పటికీ.. ఆ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఛాంపియన్ టీమ్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే కాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే ఈ జట్టుకు అంతలా పాపులారిటీ రావడానికి కారణం విరాట్ కోహ్లీనే. ఐపీఎల్ కెరియర్ ప్రారంభించిన నాటి నుంచి కూడా విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు.

 కేవలం జట్టులో కీలక ఆటగాడిగా మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లపాటు కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ. కానీ ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్ గా ఉండడం కారణంగానే ఆర్ సి బి ఐ పీ ఎల్ టైటిల్ గెలవలేక పోతుంది అంటూ విమర్శలు రావడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత ఫ్యాబ్ డూప్లెసిస్ కెప్టెన్ గా ఉండగా విరాట్ కోహ్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ అంటే ఆర్సిబి అని ఆర్సిబి అంటే కోహ్లీ అని అభిమానులు అందరూ అంటూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు అంటారు అన్న విషయం ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే గణాంకాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

 ఆర్సిబి జట్టులో ఒక్క కోహ్లీ పైనే ఆ జట్టుకు సంబంధించిన ఎన్నో రికార్డులు ఉన్నాయి. అవేంటో చూసుకుంటే..
 అర్సిబి తరపున 246 మ్యాచ్ లు ఆడి ఆ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక ఆర్సిబి తరఫున ఎక్కువ పరుగులు 7642 చేసింది కూడా కోహ్లీనే. ఆర్సిబి తరఫున 678 ఫోర్లు కొట్టి అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్గా, 250 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా.. 8 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా, 60 హాఫ్ సెంచరీ చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా మోస్ట్ క్యాచ్లు 112, కెప్టెన్ గా ఎక్కువ విజయాలు 66, మోస్ట్ సెంచరీ భాగస్వామ్యాలు ఏబిడీతో కలిసి కోహ్లీ 10, జట్టులో ఎక్కువసార్లు టాప్ స్కోరర్ 58.. ఇలా అన్ని రికార్డుల్లోను కోహ్లీనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: