మహేష్ ఇంట్రెస్టింగ్ లైనప్.. పోలా.. అదిరిపోలా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ హీరోలు కూడా వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలు చేసి ఒకటొకటిగా ఆయా సినిమాలను పూర్తి చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఈ విధంగా సినిమాలు చేసేవారు. ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలలో నటించే వారు. కానీ రానురాను క్వాలిటీ పెరిగిపోవడం ప్రేక్షకులలో అవగాహన కూడా భారీగా పెరిగిపోవడం వల్ల వారికి మంచి సినిమాలను అందించాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒక్క సినిమానే చేసుకుంటూ వచ్చారు.

ఆ తర్వాత కాలంలో సంవత్సరానికి ఒక్క సినిమా కూడా రావడం గగనం అయిపోయింది. కానీ ఇటీవల పెరిగిన సాంకేతిక కారణంగా దర్శకుల కారణంగా హీరోలలో మార్పు వచ్చింది. సంవత్సరానికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మహేష్ బాబు కూడా వరుసగా సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న మహేష్ ఇదే సంవత్సరంలో ఇటీవలే మొదలుపెట్టిన త్రివిక్రమ్ సినిమా కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

తొందరలోనే రాజమౌళి దర్శకత్వంలో చిత్రాన్ని ఆయన మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. అనిల్ రావిపూడి తో కూడా మరొక సినిమా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా భారీ స్థాయి కలిగిన దర్శకులతో ఆయన సినిమాలు చేస్తుండడం పట్ల మహేష్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక సర్కారు వారి పాట సినిమాను మే లో విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల సిద్ధమవుతున్నడం విశేషం. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: