ఓటీటీ వేదికగా ప్రసారం కానున్న సినిమాలు ఇవే..!!

Divya
బుల్లితెర అతిపెద్ద ఫ్లాట్ఫామ్ గా ఓటీటీ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని వాళ్ళు ఇంట్లోనే హాయిగా కూర్చొని ఓటీటీ సబ్స్క్రిప్షన్ ల ద్వారా కొత్త కొత్త సినిమాలు వీక్షిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే చాలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు సినిమాలను వదులుతూ వారు కూడా మంచి రేటింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇకపోతే ఈ వారం ఓ టీ టీ వేదికగా ఏ ఏ ఫ్లాట్ఫారం లో ఏ ఏ సినిమా విడుదల అవుతున్నాయో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
గమనం:
నిత్యామీనన్ , ప్రియాంక జవాల్కర్ , శ్రీయ శరణ్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించి వచ్చిన చిత్రం గమనం. ఈ సినిమా గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలై పర్వాలేదు అని అనిపించుకుంది. ఇక ముగ్గురు వేర్వేరు వ్యక్తులు జీవితాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ గమనం  సినిమా..
తడప్ :
తెలుగులో సూపర్ హిట్ ఫిలిం గా నిలిచినా ఆర్ఎక్స్ 100 చిత్రానికి రీమేక్ ఇది.. హిందీలో రీమేక్ చేయగా అందులో తారా సుతారియా, అహన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓ టీ టీ నివేదిక స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే స్పెషల్ ఎపిసోడ్:
బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ కొత్త రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు ఇంటర్వ్యూ తో మొదటి సీజన్ పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ని ఫస్ట్ సీజన్ కి సంబంధించిన హైలెట్స్ ను స్పెషల్ ఎపిసోడ్ కింద వీకెండ్లో ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం చేయబోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: