బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దక్కిన బుచ్చి బాబు కి గ్యాప్ తప్పడం లేదు..!

Pulgam Srinivas
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సన 'ఉప్పెన'  సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో బుచ్చి బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడు తన తదుపరి సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి, అది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సన  స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

 అయితే ఇంతకాలం ఎన్టీఆర్ కోసం ఎదురు చూసిన ఈ దర్శకుడికి ఎన్టీఆర్ తో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం ఈ దర్శకుడికి దొరకడం కష్టమే అనిపిస్తుంది,  ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఇప్పటికే కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలో అన్ని పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, అందువల్ల ఇప్పట్లో ఎన్టీఆర్, బుచ్చి బాబు సినిమా ఉండడం కష్టమేనని తెలుస్తోంది.  అయితే ఆ మధ్యలో పంజా వైష్ణవ్ తేజ్ తో,  బుచ్చిబాబు సన  మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి,  అయితే ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ కూడా రంగ రంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నాడు, ఇప్పట్లో వైష్ణవ్ తేజ్ కూడా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి,  ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ దర్శకుడి తదుపరి సినిమా కోసం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: