లైగర్ కోసం స్పెషల్ సాంగ్.. రౌడీతో రచ్చ చేసేది ఎవరు..?
లైగర్ సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఓ స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కంపల్సరీ.. సీరియస్ గా సినిమా నడుస్తున్న టైం లో మాస్ ఆడియెన్స్ ని అలరించేందుకు ఓ మాంచి ఊపున్న మసాలా సాంగ్ వస్తే ఆ కిక్ డబుల్ అవుతుంది. ఇక పూరీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి చాలా ప్రత్యేకత ఉంది. అప్పుడెప్పుడే 16, 17 ఏళ్ల క్రితం వచ్చిన ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాట ఇప్పటికీ వినిపిస్తుంది.
విజయ్ లైగర్ సినిమాలో కూడా అలాంటి ఓ అదిరిపోయే ఐటం సాంగ్ ఉంటుందని టాక్. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామలని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రిలీజ్ కాకున్నా ఆ సినిమా చూసిన బాలీవుడ్ భామలు విజయ్ దేవరకొండ మీద మనసు పారేసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ లైగర్ లో స్పెషల్ సాంగ్ కి బాలీవుడ్ భామలు చేసేందుకు రెడీగా ఉన్నారట. పుష్ప సినిమా కోసం సమంత చేసిన ఉ అంటావా సాంగ్ రికార్డులు సృష్టించింది అందుకే ఇప్పుడు అందరి ఫోకస్ లైగర్ స్పెషల్ సాంగ్ పై పడ్డది.