షాకింగ్: ప్రముఖ సింగర్ కన్నుమూత..!!

Anilkumar
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి .ఇప్పటికే సినీ పరిశ్రమలో అనారోగ్య కారణాల వల్ల ఎంతోమంది అగ్ర తారలు కన్నుమూశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సింగర్, బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్త్ ఆల్బమ్ తో ప్రపంచ ఖ్యాతి సంపాదించిన యూఎస్ రాక్ స్టార్ మరియు నటుడు మీట్ లోఫ్ కన్నుమూశారు. మైఖేల్ లీ అని పిలువబడే ఈ అమెరికన్ గాయకుడు సుమారు ఆరు దశాబ్దాలుగా నటుడిగానూ కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత సింగర్ గా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఆల్బమ్స్ ని అతడు విక్రయించినట్లు తెలుస్తోంది.

ఇక మీట్ లోఫ్ మరణాన్ని అతని అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రకటించడం జరిగింది. ఇక సింగర్ మీట్ లోఫ్ భార్య ఆ సమయంలో అతని పక్కనే ఉందని.. అతని చివరి 24 గంటలు అతని స్నేహితులతో ఉన్నారని ఆ ప్రకటన పేర్కొంది.అయితే అతని కుటుంబ సభ్యులు, ప్రతినిధులు వెంటనే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇక 1970 ల చివర్లో మీట్ లోఫ్ తన పాటలతో స్టేజి పర్ఫామెన్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక మీట్ లోఫ్ టెక్సాస్ లో జన్మించారు. 1977లో బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ ఆల్బమ్, అలాగే 'ప్యారడైస్ బై ది డాష్ బోర్డ్ లైట్', 'ఐ యామ్ గొన్నా లవ్ హర్ ఫర్ అస్ బాత్ అస్' వంటి హిట్ పాటలతో ఎంతో ప్రసిద్ధి చెందాడు.

ఇక ఆయన ఆల్బమ్స్ లో 'బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్' దాదాపు నలభై మూడు మిలియన్ కాపీలు అమ్ముడైంది. అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్స్ లో ఈ ఆల్బమ్ కూడా ఒకటి.ఇక సింగర్ గానే కాకుండా నటుడిగా మీట్ లోఫ్ సుమారు 65 సినిమాల్లో నటించాడు. అతని ఆల్బమ్స్ ని పక్కన పెడితే చలనచిత్రాలు, టీవీ షో లో నటించి నటుడిగానూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాల్లో 'రాఖీ హార్రర్ పిక్చర్ షో', 'ఫైట్ క్లబ్' వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరును తీసుకువచ్చాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: