వావ్ : ఎన్టీఆర్ చేతి రాత ఎంత బాగుందో చూసారా..!

murali krishna
ఎన్టీఆర్.తెలుగు జనాలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినీ నటుడిగా మరియు అద్భుత రాజకీయవేత్తగా ఆంధ్ర ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన నాయకుడు ఎన్టీఆర్.
ఆయన చేసిన సినిమాలు అయినా కానీ పరిపాలన అయినా కానీ తెలుగు ప్రజలు గర్వపడేలా ఉన్నాయి. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. చాలా సినిమాలకు నిర్మాతగా కూడా చేశాడు. తన చక్కటి నటనతో ఎన్నో అవార్డులు మరియు రివార్డులు అందుకున్నాడు. కోట్లాది మంది అభిమానాన్ని కూడా దక్కించుకున్నాడు. ఆయన జీవితంలో ఎక్కవ రోజులు సినిమాల్లోనే గడపడం గమనార్హం.
సినిమాల పరంగా ఆయనను జనాలు ఏ స్థాయిలో ఆదరించారో అలాగే రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయనను అదే స్థాయిలో ఆదరించారు.. తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఆయన అధికారంలోకి రావాలని కోట్లాది మంది కూడా కోరుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదిలోనే ఆయన అధికారంలోకి వచ్చారు. జనాలు ఆయనకు అఖండ మెజార్టీ అందించి గెలిపించారు.ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించారని అందరికి తెలుసు.. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు ఆయన ఎంతగానో కష్ట పడ్డారు.
ఎన్టీఆర్ గురించి తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఆయన చేతిరాత విషయమట తను రాసే అక్షరాలు అప్పుడే కడిగిన ముత్యాల్లా ఉంటాయి. ఆయన రాసిన ఓ లేఖ ఓ పత్రికలో కూడా ప్రచురింప బడింది. దానికి పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. దీంతో స్వయంగా తన చేతితో ఓ లేఖ రాయాలని విజయచిత్ర పత్రిక పబ్లిషర్ కోరారట  . ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ మూడు పేజీల లేఖ రాశాడట.దాన్ని యథావిధిగా ప్రచురించారని తెలుస్తుంది.ఆయన చేతి రాతను చూసి తెలుగు జనాలు కూడా ఎంతో అబ్బుర పడ్డారట. సినిమాల్లో బిజీగా ఉండే ఎన్టీఆర్.. ఖాళీ సమయంలో ఈ లేఖను రాశాడట. ఆయన చేతి రాత ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.ఎన్టీఆర్ రాసిన ఆలేఖ చూసి ఆయన అభిమానులు కూడా ఎంతో ముచ్చట పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: