రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు ఎంత నష్టం వచ్చిందో తెలుసా..?

murali krishna
టాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల జోరు కొనసాగుతోందని తెలుస్తుంది.ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ కూడా వారసులే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క ఇద్దరు తప్ప అందరు కూడా వారసులని ప్రోత్సహిస్తూ వస్తున్నారు
కొత్తవారికి అవకాశం వచ్చేది లేకుండా పోయిందిగా . హీరోలు దర్శకులు హీరోయిన్లు నిర్మాతలు ఇలా వారి వారి కుటుంబాలకు సంబంధించిన వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ వారిని ప్రేక్షకుల మీదకు నెట్టేస్తున్నారు.తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి అశ్విన్ హీరోగా పరిచయమయ్యాడని అందరికి తెలిసిందే . రౌడీ బాయ్స్ సినిమా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశ్విన్‌ ను జనాలు బాగా తిరస్కరించారు. అయినా కూడా మరిన్ని సినిమాలను ఈయన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దిల్ రాజు రౌడీ బాయ్స్ సినిమాని దాదాపుగా 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లుగా సమాచారం అందింది.కాలేజీ బ్యాక్ డ్రాప్ మరియు ఇతర విషయాల పట్ల చాలా రిచ్ గా ప్లాన్ చేశారట అందుకే సినిమాకు ఆ రేంజ్‌ బడ్జెట్ అయ్యి వుంటుందనేది టాక్ నడుస్తుందట.ఇక ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా అయినా దిల్రాజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడట.
ఈ సినిమాను 20 కోట్లతో తీసినందుకు గానూ 10 కోట్లు థియేటర్ల ద్వారా 5 కోట్లు శాటిలైట్ ద్వారా 5 వస్తాయి అని దిల్రాజు భావించినట్లు తెలుస్తుంది.. దాంతో ఈ సినిమా పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుంది అలాగే ఈ సినిమా ద్వారా అశ్విన్ హీరోగా రిచ్‌ గా పరిచయం అవుతాడు అని మంచి ప్లాన్ వేసాడు.రౌడీ సినిమా కేవలం 7 కోట్లు మాత్రమే దక్కించుకుందట. ఇంకా సినిమాకు వసూళ్లు వస్తాయనే నమ్మకం అస్సలు లేదు. కనుక రౌడీ బాయ్స్ కి భారీగా నష్టం వాటిల్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రయత్నించిన కూడా ఇప్పటికే బిజినెస్ కాని కారణంగా ఈ సినిమా ఫలితం తెలిసిన వారు కచ్చితంగా భారీ మొత్తాలకు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవచ్చట అందుకే ఆ రెండు కలిపి కూడా ఐదు కోట్ల వరకే వస్తుందని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాకు 10 కోట్ల వరకు రిటర్న్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అంటే 20 కోట్లు పెట్టిన ఈ సినిమాకు 10 కోట్లు రాగా మిగిలిన 10 కోట్లు నష్టం అన్నమాట. వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఈ మాత్రం నష్టం భరించాల్సిందే అంటూ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన వారసుడి తదుపరి సినిమా ను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల్‌ లో దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగ వార్త వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: