జగపతిబాబును తిట్టిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?

murali krishna
టాలీవుడ్ నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో ఒకరు అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఒక వైపు మాస్ హీరోయిజంతో పాటు క‌మ‌ర్షియల్ అంశాలున్న పాత్ర‌లు మరియు క‌థాంశాలున్న సినిమాలు చేస్తూ త‌న క్రేజ్‌ను సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తున్నారు.ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టవిశ్వరూపం చూపిన చిత్రాల్లో ‘అర‌వింద స‌మేత‌ వీర రాఘవ’ ఒక‌టి. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ కథాంశంతో తెర‌కెక్కింది. సీమ‌లోని ఫ్యాక్ష‌న్‌ను రూపు మాపి ప్ర‌జ‌లంద‌రూ కూడా శాంతియుత వాతావ‌ర‌ణంలో జీవించాల‌నే మ‌న‌స్త‌త్వ‌మున్న వీర రాఘ‌వ రెడ్డిగా ఎన్టీఆర్ న‌ట‌న అమోఘం అని చెప్పచ్చు.


అయితే క‌థానాయ‌కుడి ల‌క్ష్యం ఎంత గొప్ప‌దిగా ఉంటుందో అంతే బ‌ల‌మైన రియాక్ష‌న్ చూపించే ప్ర‌తినాయ‌కుడు కనుక సినిమాలో ఉంటేనే అది బాగా ర‌క్తి క‌డుతుంది. అలాంటి ఓ ప‌వ‌ర్‌ఫుల్ విలన్ బ‌సిరెడ్డిగా ‘అర‌వింద స‌మేత‌ వీర రాఘవ’లో న‌టించి అందరితో శ‌భాష్ అనిపించుకున్నారు సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. హీరోగా మెప్పించిన ఆయ‌న విల‌న్‌గా మరియు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు బాగా రాణిస్తున్నారు. దక్షిణాది చిత్రాల్లోనే కాదట ఉత్త‌రాది చిత్రాల్లోనూ ఆయ‌న ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారని సమాచారం.. ఫ్యామిలీ హీరోగా అభిమానుల‌ను సంపాదించుకున్న జ‌గ‌ప‌తిబాబు ‘అర‌వింద స‌మేత‌ వీర రాఘవ’లో బ‌సిరెడ్డి అనే కసి ఉన్న ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర‌లో ఎంతగానో మెప్పించారు.

రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ‘అర‌వింద స‌మేత‌ వీర రాఘవ’ సినిమా గురించి చెబుతూ అందులో చేసిన బ‌సి రెడ్డి పాత్ర గురించి అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలియ‌జేశారట.. ‘‘నిజానికి అరవింద సమేత వీర రాఘవ స్క్రిప్ట్ అద్భుతంగా కుదిరిందని ఇందులో హీరో ఎంత కూల్‌గా మరియు సెటిల్డ్‌గా క‌నిపిస్తాడో.. విల‌న్ అంత ఎగ్రెసివ్‌గా క‌నిపిస్తాడని త‌న పాత్ర‌తో పాటు విల‌న్ పాత్ర కూడా న‌చ్చి అర్థం చేసుకున్న ఎన్టీఆర్ ఆ సినిమాను చేయ‌డానికి ఒప్పుకోవ‌డం చాలా గొప్ప విష‌యమని చెప్పాలి..అలా ఒప్పుకుని నాకు తార‌క్ కావాల్సినంత ప‌నిష్‌మెంట్ కూడా ఇచ్చేశాడు.

రోజూ ఫోన్ చేసి తెగ వాయించేసేవాడు. నీ క్యారెక్ట‌ర్ ఇంత బావుంది అంత బావుందని చెప్పేవాడు. ర‌క ర‌కాలుగా నన్ను తిట్టేవాడు.. అది కూడా ఎంతో ప్రేమ‌తోనే. సినిమా రిలీజ్ త‌ర్వాత జ‌రిగిన ఫంక్ష‌న్‌లోనూ నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బ‌సిరెడ్డి బాగా గుర్తుంటాడు. త‌ర్వాతే నేను గుర్తుంటాను అని అన్నాడు. త‌ను అలా అన‌డం చాలా నా పాత్రకు పెద్ద స్టేట్‌మెంట్‌. మీతో ఇక అస్సలు చేయ‌లేను ఇక నాలుగైదేళ్లు మీ మొహం అస్సలు చూపించ‌కండి అన్నాడు తారక్.. దానికి నేను ఓకే తారక్ అన్నాను’’ అని జగపతిబాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: