చిరుకు మద్దతుగా రౌడీ హీరో.. ట్వీట్ వైరల్..

Satvika
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే.. ఈ విషయం పై పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ విషయం పై సినీ వర్గాల్లొ రక రకాల చర్చలు జరుగుతున్నాయి. అనేక ఆలోచనలకు దారి తీసింది.ఇండస్ట్రీ తరఫున చిరు సంప్రదింపులపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూంటే మరోవైపు వైసీపీ నుంచి నుంచి చిరుకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.. ఈ విషయం పై చిరు స్పందించారు.. ఇందులో ఎటువంటి నిజం లేదని ఒక్క మాట తో కొట్టి పడేశాడు.

ఈ విషయం పై చిరు ట్వీట్  చేశారు.తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ అందులో పేర్కొన్నారు..

చిరు చేసిన ట్వీట్ లో ఒక పదం వైరల్ అవుతుంది.  ఈ ట్వీట్ పై జనాలు భారీగా స్పందిస్తున్నారు. రీట్వీట్ లు కూడా చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. చిరంజీవి కి మద్దతూ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ మీటింగ్ ఇంకా ఫిలింసిటీ లో ఎన్ని చర్చలకు దారి తీస్తుందొ అని ఆసక్తి పెరుగుతుంది. ఎన్ని చర్చలు, విమర్శలు అందుతాయో చూడాలి. విజయ్ దేవరకొండ సినిమాల విషయాన్నికొస్తే.. లైగర్ సినిమా తో బిజిగా ఉన్నాడు. ఆ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది. చిరంజీవి.. ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు సినిమాలు చిరు చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: