బంగార్రాజు: అక్కినేని సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనూప్..!!
తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమా కి కూడా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బాస్టర్ టాక్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రతి పాట , మ్యూజిక్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా నిజంగానే సంక్రాంతి అల్లుళ్ళు వచ్చినంత సంబరంగా సాగిపోతోంది. బహుశా పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారేమో ప్రేక్షకులు.. అంతలా పాటల పరంగా సినిమా పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..
ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య తన డైలాగులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.. కృతి శెట్టి, రమ్యకృష్ణ, నాగార్జున ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలలో లీనమై పోయి ప్రేక్షకుల చేత మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా తమ పాత్రలతో కట్టిపడేస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా ఎనిమిది మంది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ తీసుకొచ్చి ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్నారు.. ఇక ఏది ఏమైనా ఈ సినిమా హిట్ అవడానికి అనూప్ రూబెన్స్ కూడా ఒక రకంగా కారణమని చెప్పవచ్చు. అందుకే అక్కినేని హీరో లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అనూప్ రూబెన్స్.