సమంత ఛాలెంజ్ విసరడంతో.. ప్రీతమ్ ఫెయిల్..!!
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా అవుతోంది. సమంత ఎప్పటికప్పుడు తన ఆరోగ్య విషయంపై కొన్ని డైట్ చిట్కాలను పాటిస్తూ ఉంటుంది. ఇక అలాగే తన తోటి వారిని కూడా అలాగే ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే సమంత గత కొద్దిరోజులుగా షూటింగ్, తన వ్యక్తిగత సమస్యల వల్ల జిమ్ కు దూరంగా ఉండేది. కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆమె రెగ్యులర్ జిమ్ లోనే తన సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. అయితే తాజాగా "లెవెల్ అప్" అనే ఒక సరికొత్త వర్కౌట్ ను తన ఫ్రెండ్స్ కి షేర్ చేసింది. వారిని కూడా అలాగే ట్రై చేయమని ఒక ఛాలెంజ్ ను కూడా చేసింది.
అలా "లెవెల్ అప్" ను సమంత స్నేహితుడైన హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ కు కూడా ఈ వీడియో ని షేర్ చేసింది సమంత. ఇక ఆమె స్నేహితురాలు ఎవరు కూడా ఈ చాలెంజ్ ను పూర్తి గా చేయలేకపోయారు. ఇక వారు చేసిన కొన్ని ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు కూడా తాజాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా సమంత చాలా హ్యాపీగా ఉందని చెప్పవచ్చు.