ఎన్టీఆర్ కోసం కొరటాల కీలక నిర్ణయం.. అంతేం లేదట!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు కొరటాల శివ. రచయితగా తానేంటో నిరూపించుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా తో దర్శకుడిగా మారి తనలోని దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా ఆయనకు రచయితగా దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆయన పై అందరి హీరోల దృష్టి పడింది.

ఈ నేపథ్యంలోనే ఆయనకు సినిమా అవకాశాలు పెద్ద హీరోల దగ్గరినుంచి ఎక్కువగా వచ్చాయి. అలా మహేష్ బాబు తో అయన చేసిన శ్రీమంతుడు సినిమా కొరటాల శివ కి మంచి హిట్ ఇవ్వగా మహేష్ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమా గా చేసి తను కూడా అగ్ర దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. ఇక ఆ తరువాత పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చి అపజయం లేకుండా ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధం చేశాడు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ చిత్రం విడుదల అవుతోంది.

ఇక ఈ సినిమా విడుదల కాకముందే కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేసే విధంగా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. వీరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే భారీ హిట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటినుంచి చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం ఓ ప్రయోగం చేయబోతున్నాడట కొరటాల శివ. ఎన్టీఆర్ బాబాయి పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ను ఎంచుకున్నాడట. ఈ నిర్ణయం పట్ల కొంత అసహనం గా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఫేడ్ ఔట్ అయిపోయిన హీరో ని ఎంచుకోవడం ఏంటి అంటున్నారు మరి కొరటాల శివ ఈ విషయం పై పునరాలోచన చేస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: