మహేష్ సర్ప్రైజ్ మామూలుగా ఉండదట!!

P.Nishanth Kumar
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి  కాగా చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టి ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్నుంటది చిత్ర బృందం. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై పోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా వాస్తవానికి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది.

అయితే ఒకప్పుడు సంక్రాంతి ఆర్ఆర్ఆర్ మరియు రాదే శ్యామ్ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ చిత్రాలకు అడ్డుగా మరొక పెద్ద సినిమా ఉండకూడదనే నేపథ్యంలో సినీ పెద్దలు అందరూ కలిసి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఏ సినిమా కోసం అయితే సర్కార్ వారి పాట పోస్ట్ పోన్ అయ్యిందో ఆ సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు చిన్న సినిమా కూడా విడుదల కావడం గగనం అయిపోయింది. ఓమిక్రాన్ నేపథ్యంలో దియేటర్లలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఇప్పుడు విడుదల చేయడం మంచిది కాదని భావించి ఈ చిత్రాలను పోస్ట్ పోన్ చేశారు.

అయితే సంక్రాంతికి విడుదల చేయాలని ఈ సినిమాను సంక్రాంతికి ఓ అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులను ఖుషి చేయాలని సూపర్ స్టార్ భావించాడట. సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చి అందరిని ఖుషి చేయాలని ఆయన భావించగా ఆయన అనుకున్న నేపథ్యంలోనే దర్శకుడు పరశురామ్ కూడా ఓ మంచి అప్డేట్ను సిద్ధం చేశారట. సంక్రాంతి రోజున ఈ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశాడు. మహేష్ తన సోషల్ మీడియాలో చేసి ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతుందని చెప్పాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: