జాక్వెలిన్ పై అలా తన ప్రేమను కురిపిస్తున్న సల్మాన్.. కారణం..!!

Divya
జాక్వెలిన్.. ఈమె పేరు ఎక్కడ చూసినా బాగా వినిపిస్తోంది..ఎందుకంటే సుమారుగా 250 కోట్ల రూపాయల స్కాంలో అరెస్టయిన సుఖేష్ ను తీహార్ జైల్లో పెట్టడం అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇతడి నుంచి భారీ ఎత్తున బహుమతులు పొందిన వారిలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కేవలం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా సుఖేష్ పెద్ద ఎత్తున బహుమతులను ఇచ్చాడని వార్తలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ విషయాలను ఈడీ విచారణలో ఇతడే స్వయంగా తెలియజేయడం గమనార్హం.
ఇకపోతే జాక్వెలిన్ కి భారీ కానుకలను సమర్పించుకున్న వారి లో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు అని బీ టౌన్ మీడియా గట్టిగా చెబుతోంది. ఎవరూ ఊహించని రీతిలో ఆమెకు అత్యంత ఖరీదైన బహుమతులను సల్మాన్ ఖాన్ ఇచ్చారట. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో కలిసి కిక్ 2  సినిమా లో జాక్వెలిన్  హీరోయిన్ గా నటించింది . ఇక ఆమె కెరీర్ కి అండగా నిలిచిన సల్మాన్ ఖాన్ కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులను ఇచ్చాడట. ఇక అందులో ముంబైలో ఒక ఖరీదైన ప్రదేశంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఖరీదైన ఆడీ కార్ ను కూడా బహుమతిగా ఇచ్చాడని సమాచారం.
ఇక సల్మాన్ ఖాన్.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఖరీదైన బహుమతులను అందించాడు అని సమాచారం. ఇకపోతే ఆయన అలవాటు ఏమిటంటే తన సహచర నటీనటులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఆయనకు కొత్తేమీ కాదు. ఆయన నుంచి బహుమతులు పొందిన వారిలో కరీనా కపూర్ , కత్రినా కైఫ్ లాంటి నటులు కూడా ఉన్నారు. కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుధీప్ కి కూడా అత్యంత ఖరీదైన కారును సల్మాన్ ఖాన్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: