బంగార్రాజు కథ ఇదే.. లీక్ అంటూ ప్రచారం!!

P.Nishanth Kumar
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా బంగార్రాజు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తుండడం ఈ సినిమా పట్ల ఇంతటి క్రేజ్ నెల కొనడానికి గల ముఖ్య కారణం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆసక్తికరమైన పాయింట్ ఉన్నందువలన ఈ సినిమా ను ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తుండటం విశేషం. 

ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇద్దరు బంగార్రాజులు ఉంటారని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో మొదటి బంగార్రాజు నాగార్జున కాగా రెండవ బంగార్రాజు అక్కినేని నాగచైతన్య అని తెలుస్తుంది. నాగార్జున పాత్ర చనిపోయి స్వర్గం లో ఉంటాడు. అలా స్వర్గంలో ఉండే బంగార్రాజు కు మనవడు ఉంటాడు. ఆయనే మరొక బంగార్రాజు.  తల్లిదండ్రులు లేని ఈ బంగార్రాజు గురించి తెలుసుకుంటారు. 

ఆలనా పాలనా చూసుకునే వారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాడు చిన్న బంగార్రాజు. అలాంటి వ్యక్తికి అదే గ్రామానికి చెందిన పొలిటికల్ లీడర్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసే దారికి వస్తాడు అనుకుంటారు బంగార్రాజు మరియు ఆయన భార్య. అందుకుగాను వారిద్దరూ స్వర్గం నుంచి దిగి వచ్చి ఏ విధంగా వారి మనవడు ని దారి లో పెట్టారు అనేదే ఈ సినిమా కథ. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ సినిమా కథ ఇదే అయితే మాత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా నాగార్జున మరొకసారి బంగారాజు పాత్రలో అలరించబోతున్నారు. మరి ఈ సారి ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: