సంపాదించినా డబ్బు మొత్తం పోగొట్టుకున్న హీరోయిన్..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమల్లో చాలా మంది లేడీ కమెడియన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గీతాసింగ్. ఆమె గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తరువాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీగా రాణించారు. కాగా.. ప్రస్తుతం ఆమెకి అవకాశాలు లేకున్నప్పటికీ ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గీతాసింగ్ ఒక ఇంటర్వ్యూ ఛానల్‌లో మాట్లాడుతూ.. తన లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిపారు. ఆమె ఒకానొక సమయంలో రోజుకు మూడు సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించానని పేర్కొన్నారు. అయితే ఆ డబ్బులను ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాటలు నమ్మి చిట్టి వేశానన్నారు. సుమారు పది లక్షల రూపాయలను తన చేతిలో పెట్టానని.. అయితే చివరికి తను నిలువునా మోసం చేసి వెళ్లిపోయిందని.. ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి తెలియజేశారు.
తను కష్టపడి సంపాదించినది మొత్తం తను తినకుండా.. తన కుటుంబానికి పెట్టకుండా.. తనే స్వయంగా తీసుకెళ్లి వేరే వాళ్ల చేతిలో పెట్టానని పేర్కొంది. అలా కష్టపడిన సొమ్ము అంతా పోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లి పోయానని వెల్లడించారు. ఇక అదే సమయంలో ఆమెకు అవకాశాలు కూడా తగ్గడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు వెల్లడించారు. ఆమె కష్టపడిన కూడబెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్న తను ఒకనొక సందర్భంలో బాగా ఆకలి వేయడంతో తినడానికి డబ్బులు లేక గుడి దగ్గర ప్రసాదంగా పెట్టిన పులిహోర తిన్నానని ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: