అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న మారుతి!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు మారుతికి మంచి పేరుంది. ఆయన తొలి చిత్రం ఈ రోజుల్లో దగ్గర నుంచి మొన్నటి మంచి రోజులు వచ్చాయి వరకు మంచి మంచి కాన్సెప్టులను తెర మీదకెక్కించి ప్రేక్షకులను అలరించి వారిలో నవ్వుల పువ్వులు పూయించారు. కామెడీ ఎమోషన్ జోనర్  లలో ఎక్కువగా సినిమాలు చేస్తూ తనలోని సత్తాను నిరూపించుకున్న మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు

సాయిధరమ్ తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ప్రతి రోజు పండగే చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఆ సినిమా తర్వాత చిన్న ట్రయల్ వేద్దామని లాక్ డౌన్ లో ఓ చిన్న సినిమాను చేశాడు. అదే మంచి రోజులు వచ్చాయి సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయినా మారుతి దర్శకత్వం కు ఈ సినిమా కథకు ఎంతో మంచి పేరు వచ్చింది. వెరైటీ కాన్సెప్టులు, ఏ దర్శకుడు టచ్ చేయని పాయింట్ చూపించి ప్రేక్షకులను మాయ చేసే మారుతి ఇప్పుడు గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే రకమైన కొత్త పాయింట్ ను తీసుకు రాబోతున్నాడు అని తెలుస్తుంది. 

ఇకపోతే తన సినిమాలలో అధికభాగం చూపించే పద్ధతిని ఇప్పుడు పక్కా కమర్షియల్ విషయంలోనూ చూపించబోతున్నాడు మారుతి. అది ఏమిటంటే ఆయన తన సినిమాలను ఎక్కువగా పండుగ సందర్భంలో మాత్రమే తీసుకు వస్తాడు. పండుగ సమయాల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడతారు అన్న సూత్రాన్ని గమనించిన మారుతి తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సినిమాలను పండుగ సమయాలలో మాత్రమే తీసుకువచ్చి భారీ వసూళ్లను సాధించేలా చేశారు. ఇప్పుడు కూడా హోలీ సందర్భంగా పక్కా కమర్షియల్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నాడు. మరి హోలీ సమయంలో పక్కా కమర్షియల్ హిట్ కొడతాడా అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: