సినిమాలకు దూరం కానున్న పెళ్లి సందడి హీరోయిన్..!!

Divya
పెండ్లి సందడి సినిమాకు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీలా.. శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడికి సీక్వెల్ గా మరోసారి రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించకపోయినప్పటికీ శ్రీ లీలా మాత్రం మంచి పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. కన్నడ ఇండస్ట్రీకు చెందిన ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో పెళ్లి సందడి సినిమా తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తనకు వరుస ఆఫర్లు వచ్చినా వాటిని దూరం చేసు కుంటోంది శ్రీ లీలా..

ఈ సినిమా తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న  శ్రీ లీలా మీడియం రేంజ్ హీరోలతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ లో సినిమాలు చేయడానికి ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీలీలా ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో సినిమాలో అవకాశం వచ్చినట్లు ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఎంబీబీఎస్ పరీక్షలు రాసే పనిలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సందడి షూటింగ్ అయిపోయి విడుదలయ్యే వరకు ఇక్కడే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ముంబైకి వెళ్లిపోయిందట.
ఇక ఎంబిబిఎస్ చదువులు అంటే ఎంతో కష్టపడి చదవాల్సి ఉంటుంది ..కాబట్టి తన కాన్సన్ట్రేషన్ మొత్తం పరీక్షల పైన పెట్టినట్లు సమాచారం. అందుకే తన పరీక్షలు అయిపోయి డాక్టరమ్మ అయ్యే వరకు ఆమె సినిమాలకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి లాగే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు డాక్టర్ ప్రాక్టీస్ మొదలు  పెడుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఏదేమైనా మళ్లీ ఈమెకు అవకాశాలు ఎక్కువగా వస్తాయని, నిర్మాతలు కూడా ఈమె కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: