"మావా మీ సినిమాలో అది ఉందా".. నెటిజన్ ప్రశ్నకి ఖతర్నాక్ జవాబు ఇచ్చిన RRR టీం..!!
ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిని సినిమా "ఆర్ ఆర్ ఆర్". దాదాపు మూడు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను తెర పై చూడడానికి ప్రేక్షకులతో పాటు.. బడా స్టార్స్ కూడా వెయిత్ చేస్తూ ఉండడం గమనార్హం. దర్శక ధీరుడు గమనార్హం తెరకెక్కించిన ఈ సినిమా "రణం రౌద్రం రుధిరం " గా మన ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఈ రెంజ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి కారణం.. ఇద్దరు బడా హీరోలు. మెగా పవర్ స్టార్ రాం చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. వీళ్లిద్దరు కలిసి మల్టీ స్టార్ మూవీ చేస్తారు అని కలలో కూడా ఊహించి ఉండరు అభిమానులు. అలాంటి ఓ క్రేజీ కాంబో ని సెట్ చేసి..దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ గిఫ్ట్ గా ఈ సినిమాని జనవరి 7న గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమైయ్యారు.
కాగా, రీసెంట్ గా ఈ సినిమా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఆ నెటిజన్ ఏం అడిగారో తెలుసా..? "మావా..ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉందా..?" అని డైరెక్ట్ గా ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే దీనికి చిత్ర బృందం రియాక్ట్ అవ్వడం. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ "ఏ నువ్వు చేస్తావా" అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.