ప్రేక్షక టాలీవుడ్: పులివెందులకు పూనకాలు తెచ్చిన బాలయ్య ఎక్కడ...?

VUYYURU SUBHASH
యువరత్న నందమూరి బాలకృష్ణ పేరు చెబితేనే మనకు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకువస్తాయి. 1999లో సమరసింహా రెడ్డి సినిమా తో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. సమరసింహా రెడ్డి సినిమా తర్వాత రాయలసీమలో బాలయ్య మార్కెట్ ఒక్కసారిగా పెరిగి పోవడంతో పాటు రాయలసీమలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాలయ్యకు అభిమానులు అయిపోయారు.

ఆ తర్వాత అదే ఫ్యాక్షన్ కథాంశంతో మరోసారి బాలయ్య 2001లో నరసింహనాయుడు సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. విచిత్రమేంటంటే నరసింహనాయుడు సినిమా కూడా అంతకు ముందు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. దక్షిణ భారతదేశ సినిమా చరిత్రలోనే తొలిసారిగా కేంద్రాల్లో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా రికార్డులకు ఎక్కింది. మరోసారి బాలయ్య 2002లో చెన్న‌కేశ‌వ రెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా కు కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది.

ఆ తర్వాత మరోసారి అదే సంవత్సరం వి.వి.వినాయక్ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నే చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా బాలయ్యను రాయలసీమ ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే రాయలసీమ లో వరదలు వచ్చాయి.. ఎక్కడికక్కడ రహదారులు కొట్టుకుపోతున్నాయి.. జనజీవనం స్తంభించిపోయింది. జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి స్థితిలో తనను ఎంతో ప్రేమించి .. వారి మదిలో గుడి కట్టిన రాయలసీమ జనాల కోసం బాలయ్య ఏం చేయలేని పరిస్థితి ఉంది. అసలు బాలయ్య అటువైపు తొంగి చూడటం లేదు. పైగా ఆయన అదే రాయలసీమ లోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. బాలయ్య ఇప్పటికైనా స్పందించి సీమ జనాల కోసం నడుం బిగించి ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందన్న‌ అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: