చిరంజీవి కి పోటీగా సూర్య..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే, చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది, అలాగే మరో ముఖ్య పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూండగా రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేలా చేశాయి.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అవడంతో ఆచార్య సినిమాను  ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఇప్పటివరకు ఆచార్య సినిమాకు దాదాపుగా ఏ సినిమా కూడా పోటీగా లేదు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న ఎదుర్కుమ్ తునిందవన్ సినిమాను చిరంజీవి ఆచార్య సినిమా కు పోటీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. కానీ ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంలో ఈ చిత్ర బృందం నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో సూర్య కు ఏ రేంజ్ మార్కెట్ వుందో దాదాపు అదే రేంజ్ మార్కెట్ తెలుగులో కూడా ఉంది. ఇప్పటికే సూర్య ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు. మంచి ఫామ్ లో ఉన్న సూర్య సినిమా చిరంజీవి సినిమాకు పోటీగా రావడం వల్ల ఆచార్య సినిమా కలెక్షన్లపై కాస్త ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: