తమిళ సినీ మార్కెట్ ను సాధిస్తున్న లేడీ సూపర్ స్టార్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ నయనతార తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా తో అటు  కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సూర్య హీరోగా తెరకెక్కిన గజిని సినిమా తో ఈ ముద్దు గుమ్మ మరొక సారి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా రెండు సినిమాలతో తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇలా కోలీవుడ్ లో టాలీవుడ్ లో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత మాత్రం ఎక్కువగా తమిళ సినిమాల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది. అప్పుడప్పుడు మాత్రమే తెలుగు సినిమాలలో నటిస్తూ వచ్చిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతోంది.

 లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఎక్కువగా గ్లామర్ పాత్రలో కనిపించడం కంటే కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నేత్రికన్, నీజల్, మూకుతాయి అమ్మన్, కోలోమవ్ కోకిల,  ఆరమ్, పుతియా నియమం, డోరా, ఐరా,కొలైయుథిర్ కాలమ్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలతో నయనతార బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది. ఇలా నయనతార తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రాబడుతోంది. నయనతార లేడీ సూపర్ స్టార్ గా తమిళ సినిమా ఇండస్ట్రీని శాసిస్తోంది అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: