'ఇండ్రస్ట్రీ లో అందరూ వాడుకొని వదిలేస్తారు'.. మారుతి సంచలన వ్యాఖ్యలు..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి. ముఖ్యంగా కామెడీ తరహాలో సినిమాలను తెరకెక్కించడంలో మారుతిది ప్రత్యేక శైలి. ఈయన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రేమ కథ చిత్రం, ఈ రోజుల్లో, బస్టాప్, బలే బలే మగాడివోయ్, మహానుభావుడుజ్ ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర మంచి హిట్స్ ని అందుకున్నాడు మారుతి  ఇక తాజాగా 'మంచిరోజులు వచ్చాయి'అంటూ మరో కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీ వాళ్లపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు మారుతి.

 కరోనా సమయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేవలం 20 రోజుల్లోనే కథ రాసి 30 రోజుల్లో ఆ కథను సినిమాగా తెరకెక్కించాలని తను భావించారట. అంతే కాకుండా అతి తక్కువ బడ్జెట్ తో సినిమాను నిర్మించాలని అజయ్ ఘోష్ ని తీసుకున్నాడట. అయితే ఈ సినిమాను కేవలం టైంపాస్ కోసం మాత్రమే తీశానని చెప్పుకొచ్చాడు మారుతి. కానీ సినిమా మాత్రం చాలా సీరియస్ గా వచ్చిందని తెలిపాడు.ఇక సినిమా హీరో సంతోష్ గురించి మారుతి మాట్లాడుతూ..' యు.వి.క్రియేషన్స్ తో ప్రస్తుతం సంతోష్ సినిమాలు తీస్తున్నారని, యూవీ క్రియేషన్స్ వారు ఎవరైనా ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు తిరిగి వంద రూపాయలు చెల్లిస్తారని, వారి రుణం అసలు ఉంచుకోరని చెప్పుకొచ్చాడు.

ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది వాడుకొని వదిలేసే వారే ఉంటారు. కానీ యువి క్రియేషన్స్ వారు అలా కాదు. ఇలాంటి మేకర్స్ ఇండస్ట్రీలో ఉండడం చాలా అరుదు' అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు మారుతి. ఇక తాను తెరకెక్కించిన 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలో సంతోష్ మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు ట్రైలర్ లకి  ప్రేక్షకుల్లో విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు మేకర్స్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: