బన్నీ సినిమాలో మంగ్లీ పాట...!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప` రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.
మొదటి భాగాన్ని `పుష్ఫ- ది రైజింగ్`గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని సమాచారం.. ప్రస్తుతం ద్వితీయార్థం సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని తెలుస్తుంది. అలాగే మొదటి భాగం రిలీజ్ నేపథ్యంలో ప్రచారం పనులు ఊపందుకున్నాయని సమాచారం.ఇప్పటికే రెండు సింగిల్స్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. `దాక్కో దాక్కో మేక` అంటూ సాగే మాస్ సాంగ్ కి శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిందని తెలుస్తుంది.. సాంగ్ లోనే బన్నీరగ్గడ్ లుక్ ని హైలైట్ చేసారని తెలుస్తుంది. ఈ పాటని ఒక్కో భాషలో ఒక్కో సింగర్ ఆలపించారని సమాచారం.
తెలుగులో శివమ్ మరియు హిందీ.. కన్నడం,మలయాళం,తమిళ్ లో విశాల్ దద్లానీ, విజయ్ ప్రకాష్ మరియు రాహుల్ నంబీయర్ అలాగే బెన్నీ గాత్రం అందించారని తెలుస్తుంది.. అటుపై రెండవ సింగిల్ `శ్రీవల్లి` అంటూ సాగే పాటను రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాటని తమిళ్,తెలుగు,మలయాళం వెర్షన్లకు సిధ్ శ్రీరామ్ గాత్రం అందించగ .హిందీ వెర్షన్ లో జావెద్ అలీ ఆలపించారని తెలుస్తుంది. ఈ రెండు పాటలకు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభించిందని సమాచారం.. తాజాగా యూనిట్ మూడవ పాటని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తుంది.. అయితే ఈ పాట సినిమాకి సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమాచారం.
పాట పూర్తిగా జానపద బాణీతో అలరిస్తుందని తెలుస్తుంది.. టాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన  అయిన మంగ్లీ ఈ పాటను ఆలపిస్తుందని సమాచారం.నేపథ్యం ఉన్న పాటలు పాడటంలో మంగ్లీ ఫేమస్ అని అందరికి తెలుసు. మంగ్లీ వాయిస్ ఈ పాటకు పర్పెక్ట్ గా సూటయ్యిందని అంటున్నారని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ చక్కని ట్యూన్ సమకూర్చినట్లు వార్త వినిపిస్తుంది.. ఈ పాట ఎప్పుడు విడుదల అవుతుందన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోందని సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: