బాలయ్య హీరోయిన్ పై ఈ విషయాలు మీకు తెలుసా..?

Divya
బాలకృష్ణ సరసన అఖండ మూవీలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే అఖండ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..కంచె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఈమె ఇమేజ్ ను బాగా తగ్గించాయి. ఇక ఈమె కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత ను చూపిస్తూ ఉంటుంది.
ఇక బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో నటించిన కొంతమంది హీరోయిన్లు స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ఇక ఇలాగైనా ఈమె స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రగ్యా జైస్వాల్ నటించిన మొదటి సినిమా ఏమిటంటే..అందరూ కంచె సినిమానే అని అంటారు. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు అవార్డుల పంట కూడా పండింది.ఈ  సినిమాలో ఈమె నటన తో పాటు అందంతో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.
అయితే హీరోయిన్ గా . ప్రగ్యా జైస్వాల్ కు తన మొదటి సినిమా కంచె సినిమా కాదట. తాను ఈ సినిమా కంటే ముందుగా రెండు సినిమాలలో నటించింది. అవి కూడా ఇతర భాషల్లో చేసిన సినిమాలు కావు. ఆ రెండు సినిమాలు కూడా మన టాలీవుడ్ సినిమాలో నటించింది ప్రగ్యా. ఇక ఈ హీరోయిన్ మొదట నటించిన సినిమా" డేగ" ఆ తర్వాత"మిర్చి లాంటి కుర్రాడు" అనే మూవీలో కూడా నటించింది.
ఈ సినిమాలు విడుదల అయినప్పటికీ కూడా ప్రేక్షకులు.. ఈ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. ఈమె ఈ సినిమాలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ డైరెక్టర్ క్రిష్ తీసినటువంటి కంచె సినిమా లో మాత్రం ప్రేక్షకుల కంట పడింది ప్రగ్యా జైస్వాల్. ఇక అంతే కాకుండా ఈ రెండు సినిమాల గురించి ఈ హీరోయిన్ ఎప్పుడూ కూడా తెలియజేయలేదు. అందుచేతనే ఈమె ఎప్పుడూ తన మొదటి సినిమా కంచె అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: