ఎన్టీఆర్ రికార్డును క్రాస్ చేయలేకపోయిన ‘రాధేశ్యామ్’
జూనియర్ ఎన్టీఆర్ పాన్ఇండియా స్టార్‌గా ప్రస్తుతం ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదల అయితే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రభాస్ మాత్రం మూడు పాన్ ఇండియా సినిమాలు చేశాడు. ఆయనకు దేశవ్యాప్తంగా కాదు.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీనికి తోడు రాధేశ్యామ్ టీజర్ మోస్ట్ అవైటేడ్ అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఈ ఈటీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారు ఎంతగానో ఎదురు చూసిన తరువాత విడుదలైన రాధేశ్యామ్ టీజర్ ఎన్టీఆర్ రికార్డును మాత్రం బ్రేకు చేయకపోవడం గమనార్హం.
"రాధేశ్యామ్" టీజర్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100కే లైక్డ్ కావడానికి 22 నిమిషాల సమయం తీసుకున్నది. కానీ రామరాజుఫర్భీం అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కొమురం భీమ్ ఇంట్రో టీజర్ కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. తరువాత స్థానాల్లో వరుసగా వకీల్‌సాబ్ 8 నిమిషాలు, సరిలేరు నీకెవ్వరు 18 నిమిషాలు, భీంఫర్ రామరాజు టీజర్లు 20 నిమిషాలతో టాలివుడ్ ఫాస్టెస్ట్ 100కే లైక్స్ సాదించాయి. వీటన్నింటిని రాధేశ్యామ్ దాటలేకపోయింది. కానీ ప్రస్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. "రాధేశ్యామ్" తరువాత సాహో, ఆచార్య, పుష్ప చిత్రాలు నిలిచాయి.