ఒక్క‌డు : ప్రేమ కోసం యాక్ష‌న్ లోకి దిగిన మ‌హేష్

Dabbeda Mohan Babu
మ‌హేష్ బాబు తెలుగు ఇండ‌స్ట్రీ లో కి వ‌చ్చిన తొలినాళ్ల‌లో పెద్ద హిట్ అందుకున్న సినిమా ఒక్క‌డు. ఈ సినిమా తోనే టాప్ హీరో ల లీస్ట్ లో మ‌హేష్ చేరాడు. ఈ సినిమా 2003 లో విడుద‌ల అయి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్ప‌టికి త‌న కేరీయ‌ర్ లో బెస్ట్ సినిమా ల్లో ఒక్క‌డు సినిమా ముందు వ‌రుస లో ఉంటుంది. ఈ సినిమా కు 2003లో ఏకంగా 8 నంది అవార్డ్ లను గెలుచుకుంది. ఉత్త‌మ ద్వితీయ చిత్రంగా, మ‌హేష్ బాబు కు ఉత్త‌మ నటుడు, గుణ శేఖ‌ర్ కు ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, అలాగే ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ ఎడిట‌ర్ తో పాటు మొత్తంగా 8 నంది అవార్డు ల‌ను ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమాలో హీరో గా మ‌హేష్ బాబు, హీరోయిన్ భూమిక చావ్లా, ప్ర‌తి నాయ‌కుడిగా ప్రకాశ్ రాజ్ నటించారు. ప్ర‌తి నాయ‌కుడి పాత్ర లో న‌టించిన ప్ర‌కాశ్ రాజ్ క‌ర్నులు లోని పెద్ద ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా క‌నిపిస్తాడు.

అలాగే ఈ సినిమా లో క‌ర్నులు లోని కొండ రెడ్డి బురుజు వ‌ద్ద జ‌రిగిన ఫైట్ స‌న్నివేశాలు ఈ సినిమా కే హైలైట్ గా ఉంది. సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే క‌బడ్డి ప్లేయ‌ర్ అయిన మ‌హేష్ బాబు హీరోయిన్ భూమిక ప్రేమ లో ప‌డుతాడు. అయితే ఓబుల్ రెడ్డి కూడా భూమిక ను ప్రేమిస్తాడు. దీంతో మ‌హేష్ భూమిక ను ఓబుల్ రెడ్డి నుంచి త‌ప్పించి చివ‌రికి వీరు ఒక్క‌టి అవుతారు. అయితే ఈ సినిమా కు మ‌రో హైలైట్ ఫ్యాక్షన్. అప్ప‌ట్లో ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ లు ఎలా ఉండేవారో.. వారు ప్రేమించినా దాని కోసం ఎం చేస్తారో క‌ళ్ల క‌ట్టిన ఈ సినిమా ద్వారా డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ చూపించాడు. ఫ్యాక్ష‌నిస్ట్ గా ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌న అద్బుతం అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్ర లో వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమా లో ఒక్క‌డు ది బెస్ట్ మూవీ ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: