కామెడీలో ఈ హీరో జూనియర్ రవితేజ?

VAMSI
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ సినిమా తో పరిచయమయిన వరుణ్ సందేశ్ మిగిలిన హీరోలు కొన్ని చిత్రాలు చేసి కనుమరుగై పోగా హీరో నిఖిల్ మాత్రం తన టాలెంట్ తో టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. యాక్షన్ తో పాటు కామెడీని పండించగల ఈ హీరో మొదటి చిత్రం హ్యాపీ డేస్ తోనే గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో మొదటి సారి తెలంగాణ యాసతో కామెడీని పండించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. తన యాక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో కామెడీ టైమింగ్ కూడా అంతే నీట్ గా క్లియర్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా సహజంగా తన పంచ్ లతో ప్రేక్షకుల్ని కితకితలు పెట్టిస్తాడు నిఖిల్.
ప్రతి చిత్రం లోనూ నవ్వుల పంట పండించే ఈ హీరో సినిమాలు అన్నిటిలోనూ కామెడీ ఫుల్ గా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ కు  ఏమాత్రం లోటు ఉండదు. ఇతని ప్రతి సినిమా ప్రత్యేకమే అయిన ఒక్క చిత్రం మాత్రమే చెప్పాలి అంటే అన్ని సూపరే అయిన టాప్ గా "కళావర్ కింగ్" సినిమా గురించి చెప్పవచ్చు. కొందరు హీరోలకు పంచ్ డైలాగ్ లు అంటూ ప్రత్యేకంగా రాయనక్కర్లేదు. సందర్భాన్ని బట్టి సీన్ బట్టి వారి కిచ్చిన డైలాగ్స్ తోనే ప్రేక్షకుల్ని నవ్విస్తారు. అలాంటి హీరోలలో నిఖిల్ కూడా ఒకరు. నిఖిల్ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ అతడికి మరింత ప్లస్సు. "కళావర్ కింగ్"  చిత్రంలో ఈ కుర్ర హీరో తన పంచ్ లతో ప్రేక్షకుల్ని పెట్టిన కితకితలు పీక్స్ కు చేరుకున్నాయి. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో 24/7 లాగా ఫుల్ సినిమా మొత్తం కామెడీ చేశారు నిఖిల్.
సినిమా మొదలయ్యింది మొదలు ఇక నవ్వులే నవ్వులు రెండున్నర గంటల పాటు నిరంతరంగా నవ్వించి ఆడియన్స్ ని ఫుల్ గా తన మాటలతో, పంచ్ లతో ఎంటర్టైన్ చేశాడు. సురేష్ డైరెక్షన్ లో  డి ఎస్ రావు నిర్మించిన ఈ చిత్రం 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ , శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించారు. అలీ, వేణు మాధవ్, రఘు బాబు , ఆహుతి ప్రసాద్ వంటి బెస్ట్ కమెడియన్స్ కూడా ఉండడంతో ఈ చిత్రంలో పంచుల తుఫాను వెల్లువెత్తింది. ఈ సినిమాలో కలెక్షన్ బాయ్ గా నిఖిల్ అలరించాడు. మధ్యలో ఒక ఇంట్లో కుక్క దగ్గర ఇద్దరు హీరో హీరోయిన్లు ఉండిపోవాల్సి వస్తుంది. ఆ సన్నివేశం అయితే పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంది. ఇతని కామెడీ టైమింగ్ అచ్చం రవితేజలా ఉంటుందని అంత అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: