నాగార్జున గురించి సంచలన కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల ద్వారా జనాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ దానిని వెంటనే డిలీట్ చేస్తూ ఉండడం పూనమ్ కౌర్ కు అలవాటే .అది మాత్రమే కాకుండా పూనమ్ కౌర్ చేసే పోస్టులు ఎంత గందరగోళానికి దారి తీస్తాయో కూడా మన అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే చాలా విషయాల గురించి స్పందించే పూనమ్ కౌర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మా ఎలక్షన్స్ గురించి కూడా స్పందించింది. ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్లు పూనమ్ కౌర్ తెలియజేసింది. ఇది మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ గెలిచినట్లయితే ఇన్ని రోజులు నేను ఎవరికీ చెప్పని, చెప్పుకోలేని బాధలు గురించి, కష్టాల గురించి బయట పెడతాను అని పూనమ్ కౌర్ తెలియజేసింది.

అలా పూనమ్ కౌర్ పోస్ట్  చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన పోస్టులో నాగార్జున గురించి తెలియజేసింది. నాగార్జున నటించిన గగనం సినిమాలో పూనమ్ కౌర్ నటించిన విషయం మనందరికీ తెలిసిందే. నాటి పరిచయాన్ని పూనమ్ కౌర్ గుర్తుచేసుకుంది. సమయం సందర్భం ఏమిటో తెలియదు కానీ నాగార్జున గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. మరియు నాగార్జున తో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. పూనమ్ కౌర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో నాగార్జున, పూనమ్ కౌర్ తో పాటు ప్రకాష్ రాజు కూడా ఉన్నాడు. డిగ్నిటీ, దయ, గ్రేస్ ఉన్న మంచి మనుషుల లో నాగార్జున ఒకరు. ఆయనకు ఆయన కుటుంబానికి అంతా మంచే జరగాలి అన్నట్టుగా పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ ను పూనమ్ కౌర్ ఎందుకు చేసిందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ ఫోటో లో ప్రకాష్ రాజ్ కూడా ఉండటం వల్ల ఇది మా ఎలక్షన్ల కోసమా అని కూడా కొంతమంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: