రాశీఖన్నా కి వారితో చేయడం ఇష్టమట!!

P.Nishanth Kumar
ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది రాశిఖన్నా.  తొలి సినిమాలోనే బబ్లీ బబ్లీగా కనిపిస్తూ తన క్యూట్ క్యూట్ అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది రాశిఖన్నా . ఆ తర్వాత ఆమె అభినయానికి మెచ్చి కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెకు తమ సినిమాలలో అవకాశం ఇవ్వగా వాటి వాటి ద్వారా తనను తాను నిరూపించుకునితెలుగులో హీరోయిన్ గా స్థిర పడిపోయింది.

జై లవకుశ సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు తీసుకు రాగా ప్రతి రోజు పండగే సినిమా కూడా మంచి విజయం సాధించి తనకు గొప్ప పేరు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆమె గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాగచైతన్య హీరోగా చేస్తున్న థాంక్యూ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా చేస్తుంది ఆ విధంగా ఇప్పుడు తెలుగులో ఆమె ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. 

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి తన గురించి తన వ్యక్తిత్వం గురించి తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ప్రేక్షకులలో తనపై ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే విధంగా కొన్ని మాటలు చెప్పింది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో తనకు ఎవరితో నటించాలనే కోరికను కూడా వెల్లడించింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఓ సినిమాలో నటించానని చెప్పింది. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులతో నటించాలనే కోరిక వెలిబుచ్చింది. మరి ఈమె వారితో సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం వారిద్దరి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి హీరోయిన్ రాశి కూడా ఏమంత తీసిపారేసే అంత హీరోయిన్ కాదు. ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటే. కాబట్టి వారు తమ సినిమాలలో పెట్టుకుని ఆమె కోరిక తీరుస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: