కుమార వర్మగా బాహుబలి లో అదరగొట్టిన సుబ్బరాజు..

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుబ్బరాజు కు మంచి పేరు ఉంది. భీమవరం లో పుట్టి పెరిగిన సుబ్బరాజు అక్కడే చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా సంపాదించుకుని జాబ్ లో సెటిల్ అయ్యాడు.  ఆయన సినిమాల్లోకి రావడం ఒక యాక్సిడెంట్ అని ఆయన పలుమార్లు చెప్పాడు.  కృష్ణవంశీ పర్సనల్ అసిస్టెంట్ ఒకతను కంప్యూటర్ ఇష్యూ రిసాల్వ్ చేయించుకోవడానికి అడగగా సుబ్బరాజు ను తీసుకుని కృష్ణ వంశీ ఇంటికి వెళ్ళాడు.  అలా సుబ్బరాజు అక్కడికి వెళ్లిన వెంటనే ఆయనను చూసి ఫిదా అయిపోయిన కృష్ణవంశీ ఆయనకు ఖడ్గం సినిమాలో అవకాశాన్ని ఇచ్చాడు.

ఆ విధంగా సుబ్బరాజు నటుడిగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. తొలి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుబ్బరాజు భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు అని ముందే ఊహించుకున్నారు. ప్రేక్షకులు ఊహించిన విధంగానే ఆయన ఇప్పుడు పెద్ద నటుడిగా మారాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో ఆయన బాక్సర్ గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.  ఇక ఆయన కెరీర్లో ఆయనకు ఎక్కువగా పేరు తీసుకు వచ్చిన సినిమాలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సినిమాలే.

పూరీ జగన్  చేసే ప్రతి సినిమాలో సుబ్బరాజు కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఆ విధంగా బాహుబలి సినిమాలో సుబ్బరాజు  కుమారవర్మ అనే ఓ ప్రత్యేక పాత్ర పోషించి ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకున్నాడు.  అలాగే దువ్వాడ జగన్నాథం సినిమాలో కూడా ఒక సైకో పేషెంట్ పాత్రను పోషించి స్టార్ నటుడిగా ఎదిగాడు. ఆ విధంగా సుబ్బరాజు తెలుగు సినిమా లో ప్రతి ఒక్క సినిమాలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించడం తో తమ సినిమాలో ఏ ముఖ్యమైన పాత్ర ఉన్న కూడా ఆయన్నే పిలవడం మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కే క్రేజీ చిత్రాలలో ఈయన నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: