హీరోయిన్ అయినా, తల్లి అయినా 'సహజ' నటే !

Vimalatha
ఒకప్పటి నేచురల్ బ్యూటీ జయసుధ. అప్పట్లో తన అందం, అభినయంతో అలరించి విశేషంగా ఆకట్టుకున్న ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి జయసుధ ఇప్పటికి పలు క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తోంది. ఒకప్పటి నటి, దర్శకురాలు విజయ నిర్మల మేన కోడలు అయిన జయసుధ 1972లో 12 సంవత్సరాల వయసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'పండంటి కాపురం' అనే సినిమా జయసుధకు ఫస్ట్ మూవీ. ఆమె అసలు పేరు సుజాత. సినిమాల్లోకి వచ్చాక మాత్రం జయసుధ గా పేరు మార్చుకుంది.
కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, తెలుగు చిత్రాలలో ఆమె నటించిన ఎన్నో పాత్రలకు పలు అవార్డులు దక్కాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆమె విషయం తెలిసిందే. మహేష్ బాబు, శర్వానంద్, రవితేజ వంటి హీరోలకు తల్లిగా నటిస్తుంది జయసుధ. గతంలో శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈ సహజ నటి ఆ తర్వాత అక్క లాంటి క్యారెక్టర్ లోనూ కనిపించింది. ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది. పలు భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించిన జయసుధ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటి.
బొమ్మరిల్లు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో తల్లిగా నటించిన జయసుధ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో మెప్పించింది. నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసింది. ఆమె తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో చేసిన కృషికి  ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎనిమిది రాష్ట్ర నంది అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకుని సౌత్‌ లో ప్రముఖ నటిగా ప్రశంసలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: