ఫస్ట్ మూవీతోనే మహేష్ కి సూపర్ హిట్ అందించిన ప్రొడ్యూసర్ ఆయన .... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేక నిర్మాణ సంస్థల్లో మంచి పేరు దక్కించుకున్న సంస్థ వైజయంతి మూవీస్. అన్న శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మూవీ లోగో లో అన్నగారు గతంలో కృష్ణుడి పాత్ర పోషించి శంఖం ఊదుతున్న స్టిల్ ని తీసుకున్నారు. దాదాపుగా తన సినిమా ప్రయాణంలో అన్న గారి దగ్గరి నుండి నేటి పలువురు హీరోల వరకు ఎందరితోనో పని చేసి పలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు అశ్వినీదత్.
ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందగా దీనిని కె రాఘవేంద్ర రావు తీశారు. ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా ప్రకాష్ రాజ్, సుమలత, జయప్రకాశ్ రెడ్డి. శ్రీహరి, శివాజీ రాజా తదితరులు ఇతర పాత్రలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఒక చిన్న పాత్ర చేసిన ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టి హీరోగా ఫస్ట్ మూవీ ద్వారానే మహేష్ బాబుకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
అప్పటికే బాల నటుడిగా పలు సినిమాలు చేసిన మహేష్ బాబు, రాజకుమారుడు మూవీలో తన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని అంశాల్లోనూ ఘట్టమనేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా అలరించారు. ఇక మూవీ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా రాఘవేంద్ర రావు తీయగా ఖర్చు విషయమై అప్పట్లో భారీగానే ఈ మూవీ కోసం బడ్జెట్ కేటాయించారు అశ్వినీదత్. సినిమా క్వాలిటీ విషయంలో మొదటి నుండి ఏ మాత్రం రాజీ పడే అలవాటు లేని అశ్వినీదత్, ఆ విధంగా మన సూపర్ స్టార్ మహేష్ ని టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: