ఎన్టీఆర్ డైమండ్.. మరీ అంత క్లాసా!!

P.Nishanth Kumar
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ను పూర్తి చేసి ఈ చిత్రం విడుదల చేయడానికి చూస్తున్నాడు. ఓ వైపు ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని వేసవి విడుదల అవతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తో ఆయన తన తదుపరి చిత్రం చేయనున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దాంతో ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు ఎంతో ఆసక్తికరమైన కథను ఎంచుకున్నాడు అంతేకాకుండా మాటలు కూడా జనతా గ్యారేజ్ సినిమా ను మించి ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ పెట్టారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని మొదటి నుంచి వార్తలు రాగా ఈ చిత్రానికి డైమండ్ అనే టైటిల్ ను పెట్టారట. 

ఈ టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో కొంత ఆనందం వెళ్లి విరవగా ఇంకొంతమంది ప్రేక్షకులు మాత్రం ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఇంత క్లాస్ టైటిల్ ఏంటి అని అంటున్నారట. వరుస ఎన్టీఆర్ సినిమాలను గమనిస్తే ఎంతో పవర్ ఫుల్ గా ఆయన స్టామినాను తెలియజేసేలా సినిమా టైటిల్ లు ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా డైమండ్ అనే క్లాసిక్ టైటిల్ ను పెడితే ఎన్టీఆర్ ను ఏ విధంగా ఈ సినిమాలో చూడడం అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెజారిటీ అభిమానులకు ఈ సినిమా టైటిల్ నచ్చలేదని చెప్పాలి. మరి అభిమానుల కోరిక మేరకు కొరటాల శివ ఈ చిత్రం టైటిల్ ను మారుస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: