సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ పాత్రకు ముందు అనుకున్నది ఎవరినో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్,స్నేహ జంటగా నటించిన సంక్రాంతి సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.అయితే ఈ సినిమా ఎలా తీసారంటే మలయాళంలో ముమ్ముట్టి హీరోగా చేసిన  ఆనందం అనే మూవీని తెలుగులో సంక్రాంతిగా రిమేక్ చేసారు.ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో వెంకటేష్ తమ్ముళ్లు గా శ్రీకాంత్,శివబాలాజీ, శర్వానంద్ నటించారు. శారద తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ మూవీలో వెంకటేష్ తర్వాత శ్రీకాంత్ పోషించిన కీలకం అని చెప్పాలి.ఇక ఆ పాత్రలో నిమగ్నమయ్యాడు శ్రీకాంత్. అయితే ఈ పాత్రకోసం ముందుగా మరొక హీరోని అనుకున్నారట. స్క్రిప్ట్ దశలో ఉండగా వడ్డే నవీన్ ని ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావించారట.

 కానీ నిర్మాత ఆర్బీ చౌదరి శ్రీకాంత్ అయితే బాగుంటుందని చెప్పడంతో శ్రీకాంత్ ని కాంటాక్ట్ చేసినట్లు డైరెక్టర్ ముప్పలనేని శివ ఓ ఇంటర్యూలో చెప్పాడు.అయితే అదే సమయంలో బాపు డైరెక్షన్ లో రాధా గోపాళం  సినిమా చేస్తున్నారు శ్రీకాంత్.ఈ సినిమాలో స్నేహ హీరోయిన్ గా చేయనున్నారు.మరోవైపు సంక్రాంతి సినిమా లో స్నేహ శ్రీకాంత్ కి వదినగా కన్పిస్తుంది. దాంతో ఈ పాత్రని జనం రిసీవ్ చేసుకోరేమోనని భావించి శ్రీకాంత్ ఈ పాత్ర చేయడానికి కొద్దిగా సంకోచించాడు. అయితే ముప్పలనేని శివ సర్దిచెప్పడం జరిగింది.దాంతో శ్రీకాంత్ ఆ పాత్రలో మంచి నటనను కనబర్చాడు. ఇక అప్పట్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే శ్రీకాంత్ తాజ్ మహల్, గిల్లికజ్జాలు వంటి సినిమాలకు ముప్పలనేని శివ డైరెక్టర్ కావడం వల్ల అవి మంచి పేరు తేవడంతో సంక్రాంతి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.ఇక ప్రస్తుతం శ్రీకాంత్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.గ్గతంలో కూడా నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించాడు శ్రీకాంత్. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత బాలయ్య సినిమాలో విలన్ రోల్ చేయనుండడంతో కచ్చితంగా ఈ 
సినిమా శ్రీకాంత్ కి  విలన్ మంచి కం బ్యాక్ ఇస్తుందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: