టీనేజ్ నుంచి యంగ్ ఏజ్... ప్రతి ఒక్కరి "ప్రేమ"మ్
ఈ సినిమా మలయాళ చిత్రం చిత్రం "ప్రేమమ్"కు రీమేక్ గా రూపొందింది. మలయాళంలో 2015లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అదే చిత్రాన్ని అదే టైటిల్ తో ఇక్కడ రూపొందించారు. ఎక్కడా రీమేక్ అనే ఫీలింగ్ రాదు. అలాగే ఎక్కడ సోల్ కూడా మిస్ అవ్వదు. దర్శకుడు మలయాళ కథతోనే మలయాళ వాసనలు లేకుండా తెలుగు తెరపై తన ప్రతిభతో మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. ఇలాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, అది కూడా రీమేక్ అంటే మాములు విషయం కాదు. కత్తి మీద సాము వంటిదే.
ఈ చిత్రంలో నాగ చైతన్య టీనేజ్ నుంచి యుక్త వయసు వరకు మూడు దశల్లో కన్పిస్తాడు. ఆ మూడు దశల్లోనూ ముగ్గురు హీరోయిన్లను లవ్ చేస్తాడు. కానీ ఎట్టకేలకు చిన్నప్పుడు తెలిసిన ఒక అమ్మాయే ఆయన జీవితంలోకి వస్తుంది. శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అనుపమ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున, వెంకటేష్ అతిథి పాత్రల్లో మెరిశారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన "ప్రేమమ్" 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి. నాగ చైతన్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లో మైలురాయి. సౌండ్‌ట్రాక్‌ను రాజేష్ మురుగేశన్ అందించగా, గోపి సుందర్ స్వరపరిచారు.