పవన్ కల్యాణ్ లగ్జరీ కార్లు ఇవే..?

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు అంటే సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 49 వసంతాలు పురస్కరించుకుని 50వ వసంతంలో అడుగు పెట్టారు. పాతికేళ్ళ వయసులో సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన పవన్ గడచిన పాతిక సంవత్సరాలలో అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తొలిప్రేమ, ఖుషి, తమ్ముడు, మొన్నీ మధ్యన వచ్చిన వకీల్ సాబ్ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. పవన్ తన సినీ చరిత్రలో కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. పాటలు పాడటం, కథలు రాయడం, సినిమాలు డైరెక్ట్ చేయడం, సినిమాలు నిర్మించడం వంటివి కూడా చేసి తానో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించారు. అయితే చాలా సాదాసీదాగా జీవితాన్ని గడిపే పవన్ కి ఉన్న లగ్జరీ కార్ల ఏవో ఇప్పుడు చూద్దాం.



ప్రస్తుతం పవన్ కల్యాణ్ అప్ కమింగ్ సినిమాలకు రూ. 65 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత కం బ్యాక్ ఇచ్చిన సినిమాకి ఆయన రూ.50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ 250 కోట్ల రూపాయలు సంపాదించే దిశగా సినిమాల్లో నటిస్తున్నారని సమాచారం.


పవన్ కల్యాణ్ కి ఉన్న లగ్జరీ కార్ల గురించి తెలుసుకుంటే.


1. రూ. 69.27-81.18 లక్షల విలువైన ఆడి క్యూ 7


2. రూ. 1.32 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జీ55 ఎఎమ్‌జీ


3. రూ. 60.23-64.29 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్



4. రూ.  33.70 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్



5. రూ .1.11 కోట్ల విలువైన జాగ్వార్ ఎక్స్‌జె


6. రూ. 30 లక్షల విలువైన స్కోడా సూపర్బ్


7. రూ. 35 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్


8. రూ. 65 లక్షల టయోటా ఫార్చ్యూనర్ జెప్ రాంగ్లర్


పైన పేర్కొన్న కార్లు దాదాపు ఆరు కోట్ల వరకు విలువ కలిగి ఉంటాయి. ఆయన ఇప్పటివరకూ కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన కార్లను రెండు మాత్రమే కొన్నారు. ఆయన సింప్లిసిటీ కి అద్దంపట్టే మరో అంశం ఏమిటంటే.. టాలీవుడ్ టాప్ హీరోల ఖరీదైన కార్స్ కలెక్షన్ లో ఆయన పేరు ఎక్కడా కనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: