'బంగార్రాజు' స్టోరీ లైన్ ఇదే..?

Anilkumar
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా  సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెలా..?లేక ప్రీక్వెలా..? అన్న విషయం మాత్రం ఇంకా తెలీదు.ఈ విషయం తెలియక కన్ఫ్యూజ్ లో పడ్డారు అక్కినేని అభిమానులు.చాలా మంది ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్ అనే అనుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున పాత్ర పేరు బంగార్రాజు కాబట్టి. అయితే ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న బంగార్రాజు సినిమా కథకు సంబంధించి కొన్ని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 ఈ సినిమాలో నాగచైతన్యకు అన్నీ తాత బుద్ధులే వస్తాయట. చైతన్య ని సరైన దారిలో పెట్టాలని నాగార్జున  స్వర్గం నుండి వస్తాడని అంటున్నారు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో నాగ్, చైతూ చేసే సందడి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇక చైతన్య, నాగ్ నిజజీవితంలో తండ్రీకొడుకులు కాగా  ఈ సినిమాలో తాత మనవుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే ఇంతకముందు వచ్చిన మనం సినిమాలో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా కనిపించారు.ఇక 47 కోట్ల రూపాయలకు ఈ సినిమా అన్ని హక్కులను జీ ఛానల్ నిర్వాహకులు కొన్నారు.

2016 లో  సోగ్గాడే చిన్నినాయన 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది.ఈ నేపథ్యంలో జీ ఛానల్ నిర్వాహకులు భారీ మొత్తానికి బంగార్రాజు మూవీ డీల్ కుదుర్చుకున్నారట.రెమ్యూనరేషన్లు కాకుండా నాగార్జున కు సుమారు పది కోట్ల రూపాయల లాభం వస్తుందని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నాగ్ పక్కన కనిపించిన రమ్య కృష్ణ ఈ సినిమాలో కూడా కనిపిస్తుందో లేదా అనేది తెలియాల్సి ఉంది.నాగ చైతన్య కు జోడిగా కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ బాగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాలా లేదా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: