పవన్, ప్రభాస్ సినిమాలపై సమంత ఏమన్నారంటే..?

Anilkumar
అక్కినేని కోడలు స్టార్ హీరోయిన్ సమంత.. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే.అంతేకాదు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీలో కూడా సమంత నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.అయితే తాజాగా సమంత ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.తాజాగా తాను నటిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన సమంత..ప్రభాస్, పవన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ గురించి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.తనకు ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తుందని అనుకున్నానని,ప్రాజెక్ట్ కె మూవీలో..

 నాగ్ అశ్విన్ తనకే ఆఫర్ ఇస్తాడని అనుకున్నానని,కానీ అలా జరగలేదని అన్నారు సమంత.మరోవైపు ప్రభాస్ సినిమా నుంచి తనను తీసేసారని,మహానటిలో తనకు ఛాన్స్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీలో ఛాన్స్ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కనిపించాయని సమంత చెప్పుకొచ్చింది.నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని నాగ్ అశ్విన్ ని గట్టిగా అడుగుతానని కామెంట్స్ చేసింది సమంత.అయితే తనపై వస్తున్న పుకార్ల గురించి ఇలా వ్యంగ్యంగా సమాధానాలు ఇచ్చారు సమంతా.ఇక శాకుంతలం షూటింగ్ పూర్తయిందని,కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటానని అంతేకాకుండా పవన్ మూవీలో కూడా..

 తాను నటించడం లేదని వెల్లడించారు సమంత.ఇక ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాతే కొత్త కథలు వింటానని,ప్రస్తుతం అయితే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ లకు తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపింది.ఇక తనకు ఎక్కువగా మహిళలను ప్రభావితం చేసే పాత్రల్లో నటించాలని ఉందని పేర్కొంది సమంత.ఇక శాకుంతలం సినిమా తర్వాత సమంత గ్యాప్ తీసుకోవడం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టీ అల్లు అర్హ వెండితెరకు పరిచయం అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: