మహేష్ సినిమాను మిస్ చేసుకున్న ప్రముఖ నటుడు ..!

Divya
మహేష్ బాబు.. 1,600 కోట్ల రూపాయలకు అధిపతి గా, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా, ప్రిన్స్ మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్ మహేష్ బాబు గా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినటువంటి ఏషియన్ ఫిలిమ్స్ తో పాటు మరొక మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. మల్టీప్లెక్స్ థియేటర్ లో అత్యధిక టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలను కూడా ఈ థియేటర్ కు వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో మన ముందుకు వస్తున్న మహేష్ బాబు .. సోనాలి బింద్రే తో కలిసి నటించిన చిత్రం మురారి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇందులో ఉన్న ప్రతి నటులు కూడా తమ లో ఉన్న నటనా ప్రతిభను కనబరిచారు అని చెప్పవచ్చు. ఇంతటి మంచి సినిమాను ఒక నటుడు మిస్ చేసుకున్నారట.. ఆయన ఎవరో కాదు నరసింహ రాజు. మురారి సినిమాను  ఈయన కాదనడానికి గల కారణం ఏమిటి..? అని ఆరా తీయగా ప్రస్తుతం కొన్ని నిజాలు బయటపడ్డాయి అవేంటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..
ఈ సినిమాలో మహేష్ బాబు కు అన్నయ్య పాత్రలో ప్రసాద్ బాబు నటించారు . అయితే ఈ పాత్రలో మొదట నరసింహ రాజును దర్శకులు సంప్రదించగా, కథ కూడా విన్న తర్వాత నరసింహ రాజు ఆ పాత్రను నటించడానికి తిరస్కరించారు. ఇక దాంతో ఈ పాత్ర ప్రసాద్ బాబు ను వరించింది. ఇక నరసింహ రాజు ఈ పాత్రను తిరస్కరించడానికి గల కారణం ఏమిటంటే,  ఆయన ఈ పాత్రకు నేను సెట్ కాను అన్న ఒక ఆలోచనతోనే , ఈ సినిమాను రిజెక్ట్ చేశాను అని పలు సందర్భాల్లో చెప్పారట. ఇంకా అయితే ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ,ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నాను అంటూ నరసింహ రాజు బాధపడ్డారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: