రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?

P.Nishanth Kumar
చిన్న సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు మారుతి. ఈరోజుల్లో సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత మెల్ల మెల్లగా పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రొడ్యూసర్ గా రచయితగా కొన్ని సినిమాలకు పని చేసిన మారుతి ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై ఆ తర్వాత బస్టాప్, కొత్త జంట సినిమాలను డైరెక్ట్ చేశాడు. తొలి రెండు సినిమాలు అడల్ట్ కంటెంట్ ఉండటంతో ఆయనను దర్శకుడిగా ఎవరు చూడలేదు. 

కానీ నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా చేసిన తీరు చూశాక మారుతి నీ ప్రతి ఒక్కరూ పొగడక తప్పలేదు. హీరోకు లోపం ఉన్నా అది హీరోయిజమే అవుతుందని తొలిసారి మారుతి ఈ సినిమాలో చూపించాడు. దర్శకుడిగా కొత్త కోణంలో ఈ సినిమా చేసి ఒక్కసారిగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో మారుతి స్టార్ డైరెక్టర్ గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. 

వెంకటేష్ నటించిన బాబు బంగారం, శర్వానంద్ మహానుభావుడు, సాయి ధరంతేజ్ ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే కమర్షియల్ మాస్ మసాలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా ఓ చిన్న బడ్జెట్ చిత్రమైన మంచిరోజులు వచ్చాయి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కూడా భారీ అంచనాలతోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇకపోతే తను చేసే తదుపరి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సినిమా గా భారీ రేంజ్ లో రాబోతుందని మారుతి తెలిపాడు. రాజమౌళి సినిమాలు మాత్రమే గ్రాండియర్ గా ఉంటాయి. ఇప్పుడు అదే రేంజ్ లో తన సినిమా చేయబోతున్నాడన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: