జూలై మాసంలో పుట్టినరోజు జరుపుకోనున్న స్టార్స్ !

Divya

జూలై మాసం రాగానే సినీ ఇండస్ట్రీలో సందడి మొదలవుతుంది. ఏమితా సందడి.. జూలై 1 కి,సినీ ఇండస్ట్రీలో సందడికి సంబంధం ఏమిటి ..అని ఆలోచిస్తున్నారా..? జూలై 1న సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు పుట్టిన రోజు కాబట్టి. ఈ జులై 1వ తేదీన నుంచి 31 వ తేదీ వరకు  చాలామంది  సినీ సెలబ్రెటీ లు  జన్మించారు. అయితే ఎవరెవరు ఈ జూలై  మాసంలో  జన్మించి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారో.. వారి గురించి తెలుసుకుందాం..

1. కోదండరామిరెడ్డి:
ప్రముఖ దర్శకుడిగా గుర్తింపుపొందిన కోదండరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి తో ఏకంగా ఇరవై మూడు సినిమాలు తీశాడు. ఈ రోజు ఆయన తన 70 వ రోజు పుట్టినరోజు జరుపుకోవడం విశేషం.
2. కె.వి.రెడ్డి:
అగ్రహీరోలతో మహాభారతంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని మాయాబజార్ రూపంలో తెరకెక్కించి , ప్రేక్షకులకు కన్నుల పండుగ జరిపించిన దర్శకుడు కె.వి.రెడ్డి గారు.ఈయన  1912 జూలై 1వ తేదీన జన్మించారు.
3. గోపీ మోహన్:
ప్రముఖ దర్శకుడు అలాగే మాటల రచయిత అయిన గోపీమోహన్ 1 జూలై 1974 న జన్మించారు.
4. విసు:
ప్రముఖ తమిళ దర్శకుడు విసు జయంతి కూడా ఈరోజే.
5. ఏ. ఎం. రాజు:
ప్రముఖ గాయకుడు అయిన ఏ.ఎం.రాజు గారు కూడా జూలై 1వ తేదీన జన్మించారు.
6. శివాత్మిక రాజశేఖర్:
రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా జూలై 1వ తేదీన జన్మించింది. ప్రస్తుతం ఈమె తేజ సజ్జ  సరసన అద్భుతం సినిమాలో నటిస్తోంది.
7. రియా చక్రవర్తి:
రియా చక్రవర్తి కూడా జూలై 1వ తేదీన జన్మించింది. ఈరోజు తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది.
8. గౌతమి:
ప్రముఖ హీరోయిన్ గౌతమి జూలై 2వ తేదీన జన్మించింది.
9. కృష్ణ భగవాన్:
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన కృష్ణభగవాన్ జూలై 2వ తేదీన జన్మించారు.
10. ఎస్ .వి. రంగారావు:
ప్రముఖ నటుడిగా ,దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపు పొందిన ఎస్.వి.రంగారావు 1918 జూలై 3 వ తేదీన జన్మించారు.
11. ఎం .ఎస్ .రామారావు:
ప్రముఖ గాయకుడిగా ప్రసిద్ధి పొందిన ఎమ్మెస్ రామారావు గారు జూలై 3 వ తేదీన జన్మించారు.

ఇక వీరే కాకుండా.. జూలై 3వ తేదీన తేజస్వి మదివాడ, చోటా కె నాయుడు జన్మించగా, జూలై నాలుగవ తేదీన దివ్యవాణి జన్మించింది. ఇక జూలై 5వ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రముఖ నటి జయలలిత, సూరజ్ పాంచోలి, బాలీవుడ్ నటుడు అయిన జాయెద్ ఖాన్ లు జన్మించారు. ఇక జులై 6వ తేదీన సింగర్ మాళవిక, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నికిత, రణవీర్ సింగ్, శ్వేతా త్రిపాఠి, పూజా గుప్తా జన్మించారు. జూలై 7వ తేదీన ప్రముఖ గాయకుడు అయిన కైలాస్ ఖేర్, కర్తవ్యం సినిమా డైరెక్టర్ మోహన్ గాంధీ, నిర్మాత కె.ఎస్.రామారావు జన్మించారు. జూలై 8 వ తేదీన రేవతి, సుకన్య, నీతూ సింగ్ జన్మించగా, జూలై 9 వ తేదీన గాయకుడు ఉన్నికృష్ణన్, గుమ్మడి వెంకటేశ్వరరావు, దర్శకుడు కె.బాలచందర్ ,సంజీవ్ కుమార్ గురు దత్ జన్మించారు. జూలై 10వ తేదీన కోట శ్రీనివాసరావు, మంజరి ఫడ్నిస్ , అలోక్ నాథ్ జన్మించగా, జూలై 11వ తేదీన రవి కిషోర్ జన్మించారు. జూలై 14వ తేదీన గీత , శరత్ కుమార్ ఆర్ రవి రాజా పినిశెట్టి, కిషోర్ ,తనికెళ్ల భరణి జన్మించగా, జూలై 15 వ తేదీన కత్రినాకైఫ్ జన్మించింది. ఇక జూలై 18వ తేదీన ప్రియాంక చోప్రా, సౌందర్య, ఎస్ వి ఆర్ జన్మించగా, జూలై 19 వ తేదీన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించారు. జూలై 20వ తేదీన శ్రీలక్ష్మి, జూలై 22న దాశరథి, కృష్ణమాచార్యులు, ముఖేష్ జన్మించగా , జూలై 23 కోడి రామకృష్ణ, సూర్య , సంగీత దర్శకుడు  హిమేష్ రేష్మియా జన్మించగా , జూలై 24వ తేదీన డైరెక్టర్ బి.గోపాల్, శ్రీవిద్య జన్మించారు. జూలై 25 వ తేదీన సత్యనారాయణ ,జూలై 27 వ తేదీన గాయని చిత్ర, సాయికుమార్, జూలై 28వ తేదీన కృష్ణవంశీ, ధనుష్, జూలై 29 రాశి, సంజయ్ దత్, జూలై 31న శరత్ బాబు, అల్లు రామలింగయ్య, ప్రముఖ నటుడు అలాగే దర్శకుడైన మణివన్నన్ ,మొహమ్మద్ రఫీ లు జన్మించారు. ఇలా జూలై నెల మొత్తం సినీ సెలబ్రెటీల పుట్టిన రోజుల తోనే సందడిగా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: