విగ్నేష్ శివన్ కంటే నయన్ వయసులో ఎంత పెద్దదో తెలుసా..?

Anilkumar
సినీ తారలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులతో పాటూ సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ ని మరింత ప్రయివేట్ గా మెయింటైన్ చేసే కొందరు సెలెబ్రెటీల గురించి తెలుసుకోవడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంటుంది జనాలకి.అలా పర్సనల్ లైఫ్ ని ప్రయివేట్ గా మైంటైన్ చేసే తారలలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ముందు వరుసలో ఉంటుంది.ఈ భామ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు తన ప్రేయసి నయన్ గురించి ఫ్యాన్స్ కి కొన్ని లీకులు ఇస్తుంటాడు విగ్నేష్.

నయనతార బాగా నటిస్తుందని అందరికీ తెలుసు.మరి ఆమె కుకింగ్ స్కిల్స్ గురించి మనకు తెలియదు కదా..అంటే దాని గురించి చెప్పడానికి నేనున్నా అంటున్నాడు విగ్నేష్.ఘీ రైస్ విత్ చికెన్ కర్రీ అదిరిపోయేలా చేస్తోందట నయనతార.ఈమెకి చికెన్ అంటే చాలా ఇష్టమట.అందులోనూ టర్కీ కోడి అంటే మహా ఇష్టమట.ఇక నయన్ చీరకట్టులో చాలా బావుంటుందని..ఆమెతో ఎక్కడున్నా స్వర్గం లాగే ఉంటుందని చెప్తున్నాడు విగ్నేష్.కానీ విగ్నేష్ గురించినయన్ ఎప్పుడు కూడా నోరు మెదపలేదు.కనీసం వాళ్ళిద్దరికి సంబంధించిన ప్రయివేట్ ఫోటోలను కూడా ఈమె ఎక్కడా పోస్ట్ చేసేది కాదు.
కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో చాలా యాక్టివ్ అవుతుంది నయనతార.

తన ట్విట్టర్లో విగ్నేష్ శివన్ పిక్స్ ని కూడా పోస్ట్ చేస్తుంది.అయితే ఆ ఫోటోలను చూస్తే.. ముందుగా అందరికీ గుర్తొచ్చేది..నయన్ కన్నా విగ్నేష్ వయసులో కచిన్నవాడా అనేదే?అయితే నయన్ కన్నా విగ్నేష్ దాదాపు  10 నెలలు చిన్నవాడని విక్కి పీడియా తెలుస్తున్న లెక్క.అయితే ఈ విషయాన్ని కూడా విగ్నేష్ శివన్ దాచకుండా ఓ ఇంటర్వ్యూలో తనకంటే నయన్ 10 నెలలు పెద్దదని బహిరంగంగా చెప్పాడు.అయినా కూడా సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ గా ఎలివేట్ అవుతున్నారు వీళ్ళిద్దరూ.ఇక ప్రస్తుతం నయనతార నెట్రికన్ అనే సినిమాలో నటిస్తోంది.తమిళంతో పాటుగా తెలుగులో కూడా తెరకెక్కుతుంది ఈ సినిమా....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: