హీరోలుగా సత్తా చాటుతున్న డైరెక్టర్ కుమారులు...

Divya

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే  ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు  చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక తండ్రి డైరెక్టర్, కొడుకు హీరో ఇలా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం.

1) ఆకాష్:
పూరి జగన్నాథ్ దర్శకుడు, ఆకాష్ హీరోగా సినిమాలు చేశారు.
2). సంతోష్ శోభన్:
ఏక్ మినీ కథ బాగా పాపులర్ అయిన సంతోష్ శోభన్ తండ్రి కూడా డైరెక్టర్. ఈయన వర్షం, బాబి వంటి సినిమాలను తీశారు.
3). అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్:
ఎక్కువగా కామెడీ సినిమాలలో నటించిన హీరో  అల్లరి నరేష్, ఇక ఆర్యన్ రాజేష్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఇక వీరి తండ్రి  ఈ వీ వీ సత్యనారాయణ  కూడా దర్శకుడే.
4). గోపీచంద్:
ప్రతి సినిమాలో వెరైటీ గా కనిపించే నటుడు గోపీచంద్. గోపీచంద్ తండ్రి టీ. కృష్ణ కూడా దర్శకుడే .
5) కె.ఎస్.ప్రకాష్:

దర్శకధీరుడు రాఘవేంద్రరావు కుమారుడు  ప్రకాష్. ఈయన"నీతో" అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
6). సుమంత్ అశ్విన్:
యంగ్ హీరోలలో ఒకరు సుమంత్  అశ్విన్ .ఈయన తండ్రి ఎమ్మెస్ రాజు నిర్మాత, దర్శకుడు కూడా.
7). వైభవ్:
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు కోదండరామిరెడ్డి. ఈయన కుమారుడు వైభవ్. ఈయన తమిళంలో సినిమాలు చేస్తూ సత్తా చాటాడు.

8) నరేష్:
ప్రముఖ హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత అయినటువంటి విజయ నిర్మల కుమారుడు నరేష్.

9). ఆది పినిశెట్టి:
ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి కూడా డైరెక్టర్.
10). విజయ్:
తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి కూడా ఒక డైరెక్టర్. ఆయన ఎవరో కాదు డైరెక్టర్ చంద్రశేఖర్.
ఇలా ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల సుపుత్రులు స్టార్ హీరోలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.స్టార్ డైరెక్టర్లు తమ తెలివిని ఉపయోగించి సినిమాను డైరెక్ట్ చేస్తే, ఇక ఆ సినిమాకు తగ్గట్టుగా హీరోలు నటించడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: