పవన్ తో ఛాన్స్.. ఒక్కటి కాదు రెండు... దశ తిరిగింది..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో ప్రత్యేక స్థానం ఉన్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. చిన్న సినిమాలతో మొదలై ఆయన కెరీర్ ఇప్పుడు పెద్ద సినిమాల స్థాయికి చేరుకుంది. 50 సినిమాలకు పైగా ఆయన సినిమాలు చేశారు అంటే ఆయన సంగీతానికి ప్రేక్షకులు ఎంతగా ముగ్ధులయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, గోపీచంద్, అఖిల్ వంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందిస్తూ ఇప్పుడున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.
ఆయన చేసిన ఎన్నో పాటలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ లిస్టులో ఉండగా ఇటీవల ఆయన సంగీతం అందించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో అన్ని పాటలు జనాదరణ పొందాయి. క్లాసిక్ సంగీతానికి పాశ్చాత్య మైన బీట్ జోడించి  పాటలను రూపొందించడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఈయన సినిమాలలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఏ సినిమాలో అయినా ఒకటి రెండు పాటలు హిట్ అవుతాయి కానీ అనూప్ రూబెన్స్ సంగీతం అందించే సినిమాలో మాత్రం అన్నిటికి అన్ని పాటలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటాయి. ప్రస్తుతం ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే కాస్త వెనుకబడ్డాట్లు కనిపించిన అనూప్ రూబెన్స్ ఎప్పుడూ ఫామ్ లో కి వచ్చేది తెలియదు.
ఇక ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూమెంట్ ఏది అంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆయనతో రెండు సినిమాలు చేసి ఏ సంగీత దర్శకుడికి దక్కని అదృష్టాన్ని దక్కించుకున్నారు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన అనూప్ రూబెన్స్ వెంటనే పవన్ కళ్యాణ్ గోపాల గోపాల అనే సినిమాను చేశాడు. ఆ సినిమా మ్యూజిక్ పరంగా అన్ని పాటలు హిట్ అవగా ఆ చిత్రానికి ఆయన చేసిన పనికి గాను పవన్ వెంటనే తన తదుపరి సినిమా ఆయన కాటమరాయుడు కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఆ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో రెండు సెన్సేషనల్ ఆల్బమ్స్ వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ప్రస్తుతం అనూప్ రూబెన్స్ చేతిలో అరడజను సినిమాలకు పైగా నే ఉన్నాయని చెప్పవచ్చు. వాటిలో వెంకటేష్ నటించిన దృశ్యం 2 సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, అల్లు శిరీష్ ప్రేమ కాదంట అనే సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: